KingDom movie : టాలీవుడ్ లో ఇప్పుడు సినిమాలు రిలీజ్ చేయాలంటే భయపడుతున్నారు. సినిమాకు ప్రీరిలీజ్ షోలు వేయాలంటే వణికిపోతున్నారు. సినిమా కు ముందు మీడియాతో ప్రమోషన్ చేయాలంటే హడలి చస్తున్నారు. ఏకంగా తన కింగ్ డం మూవీ విడుదల వేళ విజయ్ దేవరకొండ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి భయపడ్డాడట.. నిర్మాత నాగవంశీ విజయ్ తో ఏ ఇంటర్వ్యూ కూడా ఒంటరిగా చేయవద్దని కీలక ఆంక్షలు పెట్టాడట.. ఇదే విషయాన్ని మీడియా మిత్రులు ప్రెస్ మీట్ లో అడిగితే కవర్ చేసే ప్రయత్నం చేశాడు నిర్మాత నాగవంశీ..
ALSO : Vijay Deverakonda Responce: విజయ్ దేవరకొండలో ఎందుకింత వైరాగ్యం!
సినిమాకు ముందు అపశృతులు, కామెంట్స్, నెగెటివ్ స్ప్రెడ్ కాకుండా పాజిటివ్ గా ముందుకెళ్లాలనే ఇలా కింగ్ డం మూవీ టీం జాగ్రత్త పడిందంటే అతిశయోక్తి కాదు. గతంలో దిల్ రాజ్ ‘తమ్ముడు’ మూవీ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో నితిన్ ను, రాంచరణ్ ను దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్ చేసిన కామెంట్లతో ఆ సినిమాపై నెగెటివిటీ బాగా పెరిగిపోయి ఫ్లాప్ అవ్వడానికి అదో కారణమైంది.
ఇక పవన్ కళ్యాణ్ ‘హరిహరవీరమల్లు’ మూవీకి ఇదే ప్రిరిలీజ్ ల వేళ పవన్ వ్యాఖ్యలు, ట్రోలింగ్, ప్రత్యర్థులు మీదపడడంతో ఆ సినిమాకు మైనస్ అయ్యింది.
అందుకే ఇప్పుడు టాలీవుడ్ లో ముందస్తుగా సినిమా రిలీజ్ వేళ ఏ కాంట్రవర్సీకి తావు ఇవ్వకుండా హీరోలు, నిర్మాతలు జాగ్రత్త పడుతున్నారు. పాజిటివ్ టాక్ వస్తే ఓకే.. నెగెటివ్ వస్తే మాత్రం మీద పడిపోతున్నారు. అందుకే ఏకంగా కింగ్ డం మూవీకి ముందురోజు ప్రీషోలు వేస్తే టాక్ తెలిసి సినిమా ఫలితంపై ప్రభావం పడకుండా ముందు రోజు షోలు ఆపేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి నిర్మాతలు, హీరోలు సినిమా రిలీజ్ ల వేళ ఎంతలా భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.