Vidadala Rajini: వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి (Ex Minister) విడదల రజని (Vidadala Rajini) మరిది (Brother in Law) గోపి (Gopi)ని పోలీసులు అరెస్టు (Police Arrest) చేశారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ఏసీబీ (AVB) పోలీసులు గోపీని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీ (Hyderabad to AP)కి తరలిస్తున్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడులో స్టోన్ క్రషర్ (Stone crusher) యజమానిని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారనే కేసులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. విడదల రజిని, గోపి, అప్పటి విజిలెన్స్ అధికారి జాషువా, రజిని పీఏ రామకృష్ణలపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఏసీబీ కేసు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్ కోసం విడదల రజిని, గోపి హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. విజిలెన్స్ అధికారి జాషువా క్వాష్ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు రిజర్వ్‌లో పెట్టింది.
Also Read..: ఉగ్రదాడిలో అసువులుబాసిన నెల్లూరు జిల్లా వాసి..
స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ. కోట్లు వసూలు చేశారనే ఆరోపణలతో ఏసీబీ నమోదు చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని, ఆమె మరిది గోపీనాథ్ వేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి. అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ.. ఏసీబీ అధికారులు నిందితులపై ఐపీసీ సెక్షన్ 386 (చంపేస్తామని బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడడం) నమోదు చేశారని తెలిపారు. ఈ సెక్షన్ కింద పదేళ్లు శిక్షపడేందుకు వీలుందని చెప్పారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్. శ్రీరామ్, న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. కేసు వెనుక రాజకీయ కారణాలున్నాయని తెలిపారు. 41(ఏ) కింద నోటీసులు ఇవ్వకుండా, ఐపీసీ సెక్షన్ 386ను చేర్చారన్నారు. చంపేస్తామని బెదిరించి బలవంతంగా సొమ్ము వసూలు చేసినట్లు ఫిర్యాదులో ఎక్కడా లేదన్నారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటామన్నారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తుపాకీ లాక్కోబోయి.. తూటాలకు బలైపోయి..
నిఘా వర్గాలు హెచ్చరించినా
ఉగ్రదాడి దిగ్ర్భాంతి కలిగించింది: బాబు
For More AP News and Telugu News
Updated Date – Apr 24 , 2025 | 09:02 AM