ABN
, Publish Date – Apr 24 , 2025 | 03:29 AM
గోద్రెజ్ సంస్థ ఏఐ ఆధారిత భద్రతా ఫీచర్లతో కూడిన ఏడుమొత్తం కొత్త హోం లాకర్లు విడుదల చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలు గోద్రెజ్‌కు ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయని కంపెనీ తెలిపింది

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్ హోమ్ లాకర్స్ మార్కెట్‌లో ఏడు కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా అనేక భద్రతా ఫీచర్లతో ఈ లాకర్లను తీర్చిదిద్దినట్టు కంపెనీ సెక్యూరిటీ సొల్యూషన్స్ బిజినెస్ హెడ్ పుష్కర్ గోఖలే చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు తమకు అత్యం త కీలకమన్నారు. దేశవ్యాప్తంగా ఈ తరహా ఉత్పత్తుల మార్కెట్‌లో తమకు 76 శాతం వాటా ఉంటే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 85 శాతం ఉందన్నారు. గత ఆర్థిక సంవత్సరం స్మార్ట్ సెక్యూరిటీస్ ఉత్పత్తుల ద్వారా తమ కంపెనీ చేసిన రూ.1,100 కోట్ల టర్నోవర్‌లో రూ.130 కోట్లు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిందన్నారు. బ్యాంకులు, జువెలరీ సంస్థలు తమ ఉత్పత్తుల ప్రధాన వినియోగదారులని గోఖలే చెప్పారు.
Updated Date – Apr 24 , 2025 | 03:31 AM