Medigadda Delay: మేడిగడ్డ పునరుద్ధరణ ఎప్పుడు

Written by RAJU

Published on:

  • బ్యారేజీ కుంగి 18 నెలలు

  • కేంద్ర జలవనరుల సంఘం వద్ద నివేదిక

  • అది జలశక్తి శాఖకు చేరేదెప్పుడు?

  • నివేదిక సత్వరం ఇవ్వాలని పలుమార్లు కోరిన రాష్ట్ర సర్కారు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్థరణ వ్యవహారం కొలిక్కి రాలేదు. 2023 అక్టోబరు 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగింది. దాదాపు 18 నెలలు పూర్తవుతున్నా, బ్యారేజీ మరమ్మతులు/పునరుద్ధరణ అంతుచిక్కని అంశంగా మారింది. సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లోనూ భారీగా సీపేజీలు బయటపడ్డాయి. ఈ రెండు బ్యారేజీలకు తాత్కాలికంగా మరమ్మతులు చేసినప్పటికీ నీటి నిల్వకు అవకాశం లేకుండా పోయింది. ఈ బ్యారేజీల్లో నీటి నిల్వ శ్రేయస్కరం కాదని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్థరణ వ్యవహారం కొలిక్కి రాలేదు. 2023 అక్టోబరు 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగింది. దాదాపు 18 నెలలు పూర్తవుతున్నా, బ్యారేజీ మరమ్మతులు/పునరుద్ధరణ అంతుచిక్కని అంశంగా మారింది. సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లోనూ భారీగా సీపేజీలు బయటపడ్డాయి. ఈ రెండు బ్యారేజీలను తాత్కాలికంగా మరమ్మతులు చేసినప్పటికీ నీటి నిల్వకు అవకాశం లేకుండా పోయింది. ఈ బ్యారేజీల్లో నీటి నిల్వ శ్రేయస్కరం కాదని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ హెచ్చరించింది.

దాంతో ఈ బ్యారేజీల పునరుద్ధరణ, మరమ్మతులు చేపట్టడానికి వీలుగా వాటి నిర్మాణం, లోపాలపై అధ్యయనం చేయాలని కోరుతూ 2024 ఫిబ్రవరి 13వ తేదీన జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) చైర్మన్‌కు తెలంగాణ నీటి పారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా లేఖ రాయగా 2024 మార్చి 2న కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌ జె.చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో ఆరుగురితో ప్రభుత్వం కమిటీ వేసింది. ఇది జరిగి ఏడాది పూర్తవుతోంది.. గత ఫిబ్రవరి మొదటివారంలో ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ తన నివేదికను కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి అందించారు. ఆ నివేదిక ప్రస్తుతం కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌ ముకేశ్‌ కుమార్‌ సిన్హా వద్దకు చేరింది. నివేదిక సరిగ్గా లేదని గుర్తించిన ఆయన… పలు సూచనలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆయన సూచనలు చేశాకా మళ్లీ నివేదిక జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ)కు చేరితే… ఆ తర్వాతే తెలంగాణకు అందనుంది. నివేదిక సత్వరం ఇవ్వాలంటూ ఇప్పటికే పలుమార్లు తెలంగాణ సర్కారు కోరింది. మరోవైపు గోదావరికి ఏటా జూలైలోనే వరదలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాదికి మేడిగడ్డపై పూర్తిగా ఆశలు వదులుకున్నట్లేనని తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ మొత్తం 8 బ్లాకులుగా కట్టగా ఒక్కో బ్లాకులో 10-11 దాకా పియర్లు ఉన్నాయి. బ్యారేజీకి మొత్తం 85పియర్లు ఉండగా ఏ ఒక్క పియర్‌లో సమస్యలు తలెత్తినా, ఆ బ్లాకులోని మొత్తం పియర్లను తొలగించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

సుందిళ్ల బ్యారేజీలపై ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎన్‌డీఎ్‌సఏ నిపుణుల కమిటీ నివేదికను ప్రామాణికంగా చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నివేదిక రావడానికి మరో రెండు వారాల దాకా సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత పనులు చేపట్టినా… ఈ సీజన్‌కు మేడిగడ్డను అందుబాటులోకి తెచ్చే అవ కాశాలుండవు. మేడిగడ్డను పునరుద్ధరించడం లేదా… మేడిగడ్డ ఎగువన రబ్బర్‌డ్యామ్‌ లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తేనే కన్నెపల్లి (మేడిగడ్డ) పంప్‌హౌస్‌ నుంచి నీటిని పంపింగ్‌ చేసి, అన్నారంలోకి, ఆ తర్వాత సిరిపురం (అన్నారం) పంప్‌హౌస్‌ నుంచి సుందిళ్ల బ్యారేజీలోకి నీటిని పంపింగ్‌ చేయాల్సి ఉంటుంది. దాంతో ఏడాదిన్నర కిందటే కన్నెపల్లి ఎగువన రబ్బర్‌ డ్యామ్‌ కట్టాలనే ప్రతిపాదన వచ్చింది. దీనికి సంబంధించిన డిజైన్లు/డ్రాయింగ్‌లు ఇవ్వాలని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో)కు లేఖ రాయగా తొలుత ఎన్‌డీఎస్‌ఏ నుంచి అనుమతి తీసుకోవాలని ఆ విభాగం మెలిక పెట్టింది.

నెలాఖరున తేలనున్న నివేదిక

ఈనెల 30వ తేదీన జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎస్‌ఏ) చైర్మన్‌ అనిల్‌జైన్‌ హైదరాబాద్‌కు రానున్నారు. ఎన్‌డీఎ్‌సఏ చైర్మన్‌ను కలిసి, కాళేశ్వరం బ్యారేజీలపై నివేదిక అందించాలని కోరనున్నట్లు నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. దాంతో నెలాఖరున భేటీ తర్వాతే నివేదికపై స్పష్టత రానుంది. ప్రస్తుతం సీడబ్ల్యూసీ చైర్మన్‌ వద్ద నివేదిక ఉంది. మరోవైపు కాళేశ్వరం బ్యారేజీలపై ఇప్పటికే విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం విచారణ పూర్తిచేసి, నివేదికను ప్రభుత్వానికి, కాళేశ్వరం విచారణ కమిషన్‌కు అందించింది. కాళేశ్వరం విచారణ కమిషన్‌ కూడా మే నెల రెండో వారంలో నివేదిక సమర్పించే అవకాశం ఉంది. ఆ నివేదికలో కూడా కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ/మరమ్మతులపై ప్రభుత్వానికి తగిన సూచనలు అందించాలని జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఇదివర కే స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

PSR Remand Report: పీఎస్‌ఆర్ రిమాండ్‌ రిపోర్ట్‌లో విస్తుపోయే వాస్తవాలు

Pahalgam Attack: బైసారన్ నరమేధంపై విస్తుపోయే వాస్తవాలు చెప్పిన మహిళ

Read Latest Telangana News And Telugu News

Updated Date – Apr 24 , 2025 | 04:33 AM

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights