ABN
, Publish Date – Apr 24 , 2025 | 01:31 AM
బస్సులో బ్యాగ్‌ను పోగొట్టుకున్న మహిళకు పోలీసులు బ్యాగ్‌ను అప్పగించారు.

బ్యాగ్, సెల్‌ఫోనను మహిళకు అందజేస్తున్న ఎస్‌ఐ, పోలీసులు
సత్వరమే స్పందించిన పోలీసులు
మంత్రాలయం, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): బస్సులో బ్యాగ్‌ను పోగొట్టుకున్న మహిళకు పోలీసులు బ్యాగ్‌ను అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం కర్ణాటకలోని బెల గాంకు చెందిన పవిత్ర దేశపాండే అనే మహిళ తన స్నేహితురాలితో కలిసి బుధవారం మంత్రాలయానికి వచ్చింది. బస్టాండ్‌లో బస్సు దిగి స్వామి దర్శనార్థం వచ్చింది. తన హ్యాండ్ బ్యాగ్ కర్ణాటక బస్సులోనే మరిచిపోయినట్లు గమనించింది. హుటాహుటిన స్థానిక పోలీసులకు ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న మంత్రాలయం ఎస్‌ఐ శివాం జల్ తన సిబ్బందితో బస్సు లొకేషనను పసిగట్టి తిరిగి మంత్రాలయం నుంచి బెలగాంకు వెళ్తున్న బస్సును వెంబడించి నిలిపి తనిఖీలు చేశారు. బస్సులో బాధితురాలు పవిత్ర దేశపాండే పోగొట్టుకున్న బ్యాగ్‌ను స్వాధీనం చేసుకొని ఆమెకు అప్పగించారు. అందులో సెల్ ఫోన, విలువైన బంగారు ఆభరణాలు, ఏటీఎం డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. మంత్రాలయం పోలీసుల సేవలను కొనియాడుతూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ తనిఖీలో కానిస్టేబుల్ లక్ష్మన్నగౌడు, మహిళా కానిస్టేబుల్ నిర్మల పాల్గొన్నారు.
Updated Date – Apr 24 , 2025 | 01:31 AM