సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలో బుధవారం వాలీ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఆహ్వానిత వాలీబాల్(పురుషుల) పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు ఉత్సాహం గా.. ఉల్లాసంగా వాలీబాల్ పోటీలకు తరలివచ్చారు. సాయంత్రం సిరిసిల్ల పట్ట ణం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ పోటీలను కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ ప్రారంభించారు. బుధవారం, గురువారం రెండు రోజుల పాటు ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరుగుతు న్న ఈ పోటీలకు జిల్లా పరిధిలోని 16 జట్లు పోటీలో పాల్గొన్నాయి. జిల్లాస్థాయి లో జరుగుతున్న ఈ వాలీబాల్ పోటీలను తిలకించడానికి క్రీడాభిమానులు, ప్రజ లు, యువతీయువకులు పెద్దసంఖ్యలో ఆసక్తి చూపారు. ఈ కార్యక్రమంలో వాలీ బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్, ప్రధాన కార్యదర్శి అజ్మీరా రాందాస్, ఉపాధ్యక్షుడు చింతకింది శ్యాంకుమార్, సంగ స్వామి, కోశాధి కారి కోడం శ్రీనివాస్, టౌన్క్లబ్ ప్రధాన కార్యదర్శి బుర్ర నారాయణ, మాజీ అధ్య క్షుడు గుడ్ల రవి, మాజీ కౌన్సిలర్ గెంట్యాల శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యా యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
Related Post