దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటి కల్పికకు మెంటల్ డిజార్డర్ ఉందని ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుందని పేర్కొన్నారు. రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించామని, రెండేళ్లుగా మెడికేషన్ ఆపేయడంతో డిప్రెషన్‌లో ఉందని చెప్పారు. దీంతో తరచూ గొడవలు చేయడం, న్యూసెన్స్ చేస్తోందని తెలిపారు. కల్పిక వల్ల ఆమెకు, కుటుంబ సభ్యులకు, సాధారణ ప్రజలకు సైతం ప్రమాదం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన కూతురిని మళ్లీ రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలనిన పోలీసులను కోరారు. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా కల్పిక ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. కొంతకాలం క్రితం పబ్ లో కేక్ ఇవ్వలేదని రచ్చ చేసిన కల్పిక, ఇటీవలే ఓ ఫామ్ హౌస్‌లో సిబ్బందితో గొడవకు దిగింది. ఈ క్రమంలో ఆమెపై కేసులు కూడా నమోదయ్యాయి. మరోవైపు ఆమె సోషల్ మీడియాలోనూ అసభ్యకరమైన పోస్టులు పెడుతూ ఎప్పుడూ లేని విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇక తాజాగా కల్పిక తండ్రి పోలీసులకు రాసిన లేఖ ఆసక్తికరంగా మారింది.