AM Ratnam Reaction Ambati: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు ఆ రేంజ్ టాక్ రావడానికి ప్రధాన కారణం, అత్యంత దారుణమైన గ్రాఫిక్స్ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే గ్రాఫిక్స్ సన్నివేశాలు చాలా పేలవంగా ఉన్నాయని, ఒక సూపర్ స్టార్ సినిమాకు, కనీసం సీరియల్స్ లో ఉండే గ్రాఫిక్స్ క్వాలిటీ ని కూడా మైంటైన్ చేయలేకపోయారని, చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు. అయితే ఈ సినిమా ప్రీమియర్ షోస్ కి టికెట్ రేట్స్ పెంచడం పై వైసీపీ పార్టీ కి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) వ్యతిరేకిస్తూ తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో చేయడం, అది బాగా వైరల్ అవ్వడం జరిగింది.
Also Read: ఫ్రస్టేషన్ లో జనసేన ఎమ్మెల్యేలు..’సర్దుకుపోవడం’ పై అసంతృప్తి!
ఈ వీడియో ని నిర్మాత AM రత్నం(AM Ratnam) కూడా చూసి ఉంటాడు. అందుకే ఆయన స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘ఇష్టమున్న వాళ్ళు ఎంత రేట్ పెట్టినా వచ్చి చూస్తారు, ఇష్టంలేని వాళ్ళు చూడరు. ఇక్కడ మేము ఎవరినీ సినిమాని చూడమని బలవంతం చేయలేదు. అంబటి రాంబాబు కానీ, ఇంకెవరైనా కానీ, టికెట్ రేట్స్ పెంచుకున్నారు, జనాల నుండి డబ్బులు దోచుకుంటున్నారు లాంటి మాటలు మాట్లాడకండి. సినిమాలు తీస్తే మీకు ఆ నొప్పి తెలుస్తుంది. ఆయనొచ్చి రోడ్డు మీద డ్యాన్స్ లు వేస్తే సరిపోదు. వ్యక్తిగత విమర్శలు చెయ్యకూడదు కానీ, ఆయన నన్ను అన్నారు కాబట్టి అంటున్నాను. సినిమా వచ్చి తియ్యమనండి అప్పుడు తెలుస్తుంది. దమ్ముంటే నాతో వచ్చి పని చెయ్యమని చెప్పండి’ అంటూ చెప్పుకొచ్చాడు నిర్మాత AM రత్నం. పబ్లిక్ AM రత్నం అంబటి రాంబాబు పై ఈ రేంజ్ కామెంట్స్ చేయడం అందరినీ షాక్ కి గురి చేసింది.
Also Read: సజ్జలను అనుమానిస్తున్న జగన్!
ఈయనకి ధైర్యం మామూలు రేంజ్ లో లేదుగా, తొణకకుండా, నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా, ముఖం లో ఇసుమంత భయం బెరుకు చూపించకపోగా, తన సినిమాపై నెగటివ్ కామెంట్స్ చేసిన వారిపై కూడా ఆయన కౌంటర్లు వేస్తున్నాడంటే చిన్న విషయం కాదండోయ్. అందుకే AM రత్నం తో జాగ్రత్తగా ఉండాలని అందరూ అంటూ ఉంటారు. ఇక ‘హరి హర వీరమల్లు’ మూవీ రెండవ రోజు వసూళ్ల విషయం లో కాస్త తడబడినప్పటికీ, మూడవ రోజు నుండి భారీగా పుజుకుంది. నేడు అయితే దాదాపుగా ప్రతీ సెంటర్ లోనూ హౌస్ ఫుల్ షోస్ ని రిజిస్టర్ చేసుకుంది ఈ చిత్రం. చూస్తుంటే ‘అజ్ఞాతవాసి’ రేంజ్ లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యే అవకాశం లేదని అనిపిస్తుంది. చూడాలి మరి బాక్స్ ఆఫీస్ పరంగా స్టేటస్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.