Reema Sen latest Looks: 2000 దశకం ప్రారంభం లో స్వర్గం నుండి భువికి దిగి వచ్చిన దేవకన్యలు లాగా కొంతమంది హీరోయిన్లు మన ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు. వీళ్లకు యూత్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రెండు మూడేళ్లకే టాప్ చైర్ లో కూర్చోబెట్టారు. చేతినిండా అవకాశాలతో ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం లేదు అనే రేంజ్ పని కల్పించారు. అలాంటి మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు రీమా సేన్(Reema Sen). ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘చిత్రం’ ద్వారా ఈమె వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఈమె హీరోయిన్ గా నటించిన ‘మనసంతా నువ్వే’ కమర్షియల్ గా అప్పట్లో ఒక సంచలనం. అలా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ని అందుకొని, అతి తక్కువ సమయం లోనే సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా మారిపోయింది.
Also Read: నా భర్త చేతకాని వాడంటూ యాంకర్ అనసూయ హాట్ కామెంట్స్!
కేవలం హీరోయిన్ రోల్స్ కి మాత్రమే కాదు, నెగిటివ్ రోల్స్ లో కూడా ఈమె అప్పట్లో ఇరగదీసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలా కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే 2012 వ సంవత్సరం లో శివ కరణ్ సింగ్ అనే వ్యాపారవేత్తని పెళ్ళాడి సినిమాలకు దూరమైంది. ఇప్పుడు ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే చాలా కాలం తర్వాత హీరోయిన్స్ అందరూ నిన్న రీ యూనియన్ అయ్యారు. గోవాలో జరిగిన ఈ వేడుక లో రీమా సేన్ తో పాటు అలనాటి హీరోయిన్స్ సంగీత, సిమ్రాన్, మీనా, సంఘవి, మాళవిక, మహేశ్వరీ, రమ్య కృష్ణ, ఊహ తదితరులు హాజరు అయ్యారు. ఇక హీరోల విషయానికి వస్తే జగపతి బాబు, శ్రీకాంత్ ,డైరెక్టర్ శంకర్, ప్రభుదేవా, లింగుస్వామి, మోహన్ రాజా వంటి వారు వచ్చారు.

వీళ్లంతా కలిసి పార్టీ చేసుకుంటూ , పాత మధుర జ్ఞాపకాలను తల్చుకుంటూ, సరదాగా నిన్న రాత్రి గడిపేశారు. అయితే ఈ హీరోయిన్స్ లో దాదాపుగా మనం అందరి లేటెస్ట్ లుక్స్ ని ఇంతకు ముందే చూసేసాము. ఒక్క రీమా సేన్ కి సంబంధించిన లేటెస్ట్ ఫొటోలే ఇన్ని రోజులు మనం మిస్ అవుతూ వచ్చాము. కానీ ఆమె కూడా ఈ రీ యూనియన్ లో కనిపించింది. ఆమె లుక్స్ ని చూస్తుంటే అప్పటికీ, ఇప్పటికీ ముఖం లో పెద్ద మార్పులు కనిపించలేదు. కేవలం బుగ్గలు ఒక్కటే కాస్త పెరిగాయి. ప్రస్తుతం ఆమె వయస్సు 43 ఏళ్ళు, ఒక బిడ్డకు తల్లి కూడా, ఆ మాత్రం చిన్నపాటి మార్పులు రాకుండా ఎందుకు ఉంటాయి లేండి. రీమా సేన్ లేటెస్ట్ లుక్ ని చూసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి.
