US global dominance: అమెరికాకు సుంకాలు విధించడం కొత్త కాదు.. లక్షల కోట్లతో ఇదిగో ఇలాంటి వ్యవస్థలను నిర్మించింది

US global dominance: రక్షణ రంగంలో నెంబర్ వన్.. ఆయుధాల తయారీలో నెంబర్ వన్.. శాస్త్ర సాంకేతిక రంగాలలో నెంబర్ వన్.. తయారీ రంగంలో నెంబర్ వన్.. అప్పుల్లో కూడా నెంబర్ వన్.. ప్రపంచ మారకంలో నెంబర్ వన్.. వర్తకంలో, వాణిజ్యంలో నెంబర్ వన్.. అందువల్లే అమెరికా ప్రపంచాన్ని శాసిస్తుంది. ప్రపంచాన్ని కనుసైగతో వణికిస్తుంది. అందువల్లే అమెరికా అంటే ప్రపంచం మొత్తం భయపడుతుంది. అమెరికా ముందు తలవంచుతుంది..

ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికా ప్రపంచం మీద సాగించే పెత్తనం పెరిగిపోయింది. అన్ని దేశాల మీద సుంకాలు విధించడం.. తమ దేశంలో ఉంటున్న వారిని బయటికి పంపించడం.. వంటివి జరిగిపోతున్నాయి. యుద్ధ ఖైదీల మాదిరిగా వివిధ దేశాలకు చెందిన వారిని ట్రంప్ బయటికి పంపించాడు.. ఇప్పుడు సుంకాల కత్తిని ప్రపంచం మెడ మీద పెట్టి ఇబ్బంది పెడుతున్నాడు.. అయితే ఇలాంటి సుంకాలు విధించడం అమెరికాకు కొత్త కాదు. ప్రపంచ దేశాల మీద సుంకాలు విధించి అమెరికా భారీవ్యవస్థలను నిర్మించుకుంది. అమెరికా ఏర్పాటు చేసుకున్న వ్యవస్థల ఖర్చుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Read Also: కింగ్డమ్ మూవీ యూఎస్ఏ రివ్యూ…హిట్టా..? ఫట్టా..?

నార్త్ ఆర్ వో పీ బీ 2 స్పిరిట్ యుద్ధ విమానాన్ని 4.2 బిలియన్ డాలర్ల ఖర్చుతో అమెరికా ఏర్పాటు చేసుకుంది. నాసా ప్రిసర్ వెన్స్ రోవర్ ను 2.7 బిలి యన్ డాలర్ల ఖర్చుతో ఏర్పాటు చేసింది.
జుమ్ వాల్ట్ స్టీల్త్ డిస్ట్రోయర్ అనే జలాంతర్గామిని 8 బిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మించింది. కొలంబియా క్లాస్ సబ్ మెరైన్ ను 9.15 బిలియన్ డాలర్లతో నిర్మించింది. గేరాల్డ్ ఆర్. ఫోర్డ్ క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్ ను 13 బిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మించింది. 150 బిలియన్ డాలర్ల ఖర్చుతో అంతరిక్షంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించింది. ఇవన్నీ కూడా ప్రపంచ దేశాల ముక్కు పిండి వసూలు చేసిన డబ్బుతోనే అమెరికా నిర్మించింది. ఇప్పుడు కూడా ప్రపంచ దేశాల మీద కత్తి పెట్టిన అమెరికా.. ఇటువంటి వ్యవస్థలను నిర్మిస్తుందో చూడాల్సి ఉంది.

Leave a Comment