Rajinikanth Accident: సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) ప్రమాదానికి గురైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారింది. ముందుగా ఈ వీడియో నిజమేనా?, లేకపోతే AI చేశారా అని అభిమానులు సందేహ పడ్డారు. కానీ నిజమైన వీడియోనే అని ఆ తర్వాత తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రజనీకాంత్ ఉదయం నిద్ర లేవగానే నడుచుకుంటూ తన గేట్ వద్దకు వెళ్లి న్యూస్ పేపర్ ని తీసుకోవడానికి వెళ్ళాడు. తిరిగి వస్తుండగా ఆయన జారీ క్రిందకి పడిపోయాడు. ఆ పడిన విధానం చూస్తే అభిమానులు కాస్త కంగారు పడడం సహజమే. ఎందుకంటే కుర్రాళ్ళు కూడా ఆ రేంజ్ లో క్రిందపడితే తట్టుకోవడం కాస్త కష్టం. కానీ రజనీకాంత్ చాలా సింపుల్ గా పైకి లేచి మళ్ళీ స్టైల్ గా నడుచుకుంటూ లోపలకు వెళ్ళిపోయాడు. చెన్నై లో భారీ వర్షాలు, నెల మొత్తం తడిచిపోయింది, ఆ తేమ నేలపై నడవడం వల్లే రజనీకాంత్ అలా పడిపోయాడు అంటున్నారు.
Also Read: ఓజాస్ గంభీరా(OG ) వచ్చేస్తున్నాడు.. ఆగష్టు 2న థియేటర్స్ లో మోత మోగడం ఖాయం…
ఈ వీడియో ని ఆర్టికల్ చివర్లో మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక రజనీకాంత్ సినిమాల విషయానికి ఆయన హీరో గా నటించిన ‘కూలీ'(Coolie Movie) చిత్రం ఆగష్టు 14 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం పై అంచనాలు కనీవినీ ఎరుగని రేంజ్ లో ఉన్నాయి. దానికి తోడు రీసెంట్ గా విడుదలైన ‘మౌనికా’ పాట కానీ, అదే విధంగా ‘పవర్ హౌస్’ పాట కానీ భారీ చార్ట్ బస్టర్స్ గా నిలవడంతో అప్పటి వరకు ఉన్న అంచనాలు పదింతలు ఎక్కువ అయ్యాయి. ఇక ఆగష్టు 2 న విడుదల చేయబోయే ట్రైలర్ ఈ సినిమా పై ఇంకెంత అంచనాలను పెంచుతుందో చూడాలి. ఓవర్ సీస్ లోని నార్త్ అమెరికా లో అప్పుడే 6 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రాబట్టింది ఈ చిత్రం.
ఇకపోతే ఈ సినిమాలో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) మెయిన్ విలన్ క్యరెక్టర్ చేశాడు. కెరీర్ లో మొట్టమొదటిసారి ఆయన విలన్ క్యారక్టర్ చేయడం పై అక్కినేని అభిమానులే కాదు, జనరల్ ఆడియన్స్ కూడా థ్రిల్ కి గురయ్యారు. నాగార్జున ఎలా నటించి ఉండుంటాడో చూద్దామని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అదే విధంగా ఈ చిత్రం లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్(Aamir Khan) కూడా ఒక కీలక పాత్ర పోషించాడు. ఆయన క్యారక్టర్ సినిమా చివర్లో వస్తుంది. అంటే విక్రమ్ సినిమాలో రోలెక్స్ క్యారక్టర్ ఎంట్రీ ఎలా ఉంటుందో, అలా ఉంటుంది అన్నమాట. వీళ్లిద్దరు కాకుండా ఈ చిత్రం ఉపేంద్ర, సౌబిన్ సాహిర్ తదితరులు కీలక పాత్రలు పోషించగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.