Liquor Scam YS Bharathi: వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) మద్యం కుంభకోణం విషయంలో కలవరపాటుకు గురవుతున్నారా? తన అరెస్టు కంటే.. భార్య భారతి రెడ్డి పేరు తెరపైకి వచ్చిందన్న భయం వెంటాడుతోందా? ప్రత్యేక దర్యాప్తు బృందం చార్జి షీ ట్లో కూడా కొన్ని చోట్ల భారతి రెడ్డి పేరు వినిపించిందన్న టాక్ వచ్చింది. అయితే దానికి కారణం లేకపోలేదు. ఈ కేసులో భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్టయ్యారు. భారతి సిమెంట్స్ చైర్మన్గా భారతీ రెడ్డి ఉన్నారు. అదే సంస్థకు చెందిన డైరెక్టర్ అరెస్టు కావడం.. ఆయన భారతీ రెడ్డి ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తుండడంతోనే ఈ కొత్త చర్చ ప్రారంభం అయింది. ఇప్పుడు మద్యం కుంభకోణంలో తనను అరెస్టు చేస్తారన్న అనుమానాలు ఒకవైపు.. కేసులో భారతీ రెడ్డి పాత్రను బయట పెడతారని మరోవైపు జగన్ భయపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన న్యాయ నిపుణులతో విస్తృత చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
Also Read: జగన్ ఢిల్లీ బాట.. ఏంటి కథ?
దర్యాప్తులో సమగ్ర వివరాలు..
ఏపీలో( Andhra Pradesh) మద్యం కుంభకోణంతో 3500 కోట్ల రూపాయలను కొల్లగొట్టారు అని సిట్ తేల్చింది. దాదాపు 18 వేల కోట్లకు పైగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు గుర్తించింది. దాదాపు ఈ కేసులో 45 మంది వరకు నిందితులు ఉన్నట్లు విచారణలో తేలింది. ఇప్పటివరకు 12 మంది అరెస్టు జరిగింది. అయితే తదుపరి అరెస్టు జగన్మోహన్ రెడ్డి దేనని ప్రచారం జరుగుతోంది. అన్నింటికీ మించి భారతీ రెడ్డి పేరును సైతం కేసులో చేర్చుతారని ఒక రకమైన టాక్ ఉంది. ఈ కేసులో మూలాలను శోధించి మరి కేసులు నమోదు చేస్తుండడాన్ని ఎక్కువమంది గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా భారతి సిమెంట్స్ కు సంబంధించి మద్యం కుంభకోణం ద్వారా లావాదేవీలు జరిగాయని సిట్ దర్యాప్తులో తేలినట్లు సమాచారం.
Also Read: రాజకీయాలకు మాజీ సీఎం గుడ్ బై!
కార్యాలయంలో తనిఖీలు..
భారతి సిమెంట్స్ లో డైరెక్టర్ గా ఉన్న బాలాజీ గోవిందప్ప( Balaji govindappa) అరెస్టు ఎప్పుడో జరిగింది. అయితే ఇటీవల భారతి సిమెంట్స్ కార్యాలయానికి సంబంధించి తనిఖీలు జరిగినట్లు తెలుస్తోంది. తద్వారా బాలాజీ గోవిందప్పను ముందు పెట్టి మద్యం కుంభకోణంలో భారీ అవినీతికి పాల్పడినట్లు అనుమానిస్తోంది ప్రత్యేక దర్యాప్తు బృందం. అయితే ఈ పరిణామాలు జగన్మోహన్ రెడ్డిలో భయాన్ని రేపుతున్నాయి. తన అరెస్టును అడ్డుకోవడం ఒకవైపు.. మరోవైపు భార్య భారతి రెడ్డి పేరు చేర్చకుండా మరోవైపు.. ఇలా ఏక వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు రాజకీయ కార్యకలాపాలను పక్కనపెట్టి న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో..