YS Jagan Political Strategy: ఇలాంటి పనులతో జగన్ బిజీ అవుతాడనుకోలేదు!

YS Jagan Political Strategy: జగన్( Y S Jagan Mohan Reddy ) రాజకీయంగా దూకుడు పెంచాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ప్రజల్లో సానుభూతిని రగిల్చి మరోసారి పార్టీకి పూర్వ వైభవం తేవాలని భావిస్తున్నారు. ఇందుకుగాను గట్టి వ్యూహంతోనే ఉన్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వరుసగా వైసిపి నేతలపై కేసులు నమోదవుతున్నాయి. అరెస్టులు కూడా జరుగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో దూకుడు కలిగిన నేతలపై కూటమి ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి ఒక వ్యూహాత్మకంగా వెళ్తోంది. ఈ క్రమంలో చాలామంది తాజా మాజీ మంత్రులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల అరెస్టుల పర్వం నడిచింది. అయితే ఇలా అరెస్టు అయిన నేతల పరామర్శలు పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మిగతా వారిని సైతం పరామర్శించి.. పనిలో పనిగా ప్రజల నుంచి సానుభూతి సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రజా సమస్యలను గాలికి వదిలేసి నేతల పరామర్శకు పరిమితం అవుతున్నారన్న విమర్శ జగన్ పై ఉంది.

Also Read: లిక్కర్ స్కాంలో భారతీ రెడ్డి పేరు!?.. జగన్ కు షాక్!

పరామర్శలతో..
కూటమి( alliance) అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో మాజీ ఎంపీ నందిగాం సురేష్ అరెస్టయ్యారు. ఆయనను పరామర్శించారు జగన్. తర్వాత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని సైతం జైల్లో పరామర్శించి ఓదార్చారు. అటు తరువాత నెల్లూరు వెళ్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సైతం కలిసి ధైర్యం చెప్పారు. ఇప్పుడు మరోసారి నెల్లూరు వెళ్లనున్నారు జగన్మోహన్ రెడ్డి. మైనింగ్ కుంభకోణంలో అరెస్టయ్యారు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయనను సైతం పరామర్శించనున్నారు. కొద్దిరోజుల కిందట గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయనను పరామర్శించేందుకు జగన్ ప్రయత్నించారు కానీ వీలు కాలేదు. ఇప్పుడు తాజాగా పరామర్శించేందుకు సిద్ధపడుతున్నారు ..

Also Read: 29న జగన్ కీలక నిర్ణయం

పెరుగుతున్న పరామర్శల జాబితా..
మద్యం కుంభకోణం కేసులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ( Mithun Reddy)అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు ఎటువంటి ముందస్తు బెయిల్ మంజూరు కాలేదు. మరోవైపు ఆ కేసు విచారణ ఆగస్టు 1న జరగనుంది. అయితే ఇప్పట్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ లభించే అవకాశం లేదు. అయితే మిధున్ రెడ్డి అరెస్ట్ అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి వచ్చి పరామర్శిస్తారని అంతా భావించారు. కానీ ఎందుకు జగన్ అలా చేయలేదు. ఇప్పుడు పరామర్శించేందుకు జగన్ వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆడుదాం ఆంధ్ర అవినీతి కేసులో ఆర్కే రోజా, నెల్లూరు మైనింగ్ కుంభకోణంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. అదే జరిగితే జగన్ జైలు పరామర్శల యాత్ర కొనసాగే అవకాశం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి నేతల పరామర్శకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ఆ సమయాన్ని ప్రజా సమస్యలకు ఇవ్వడం లేదన్న విమర్శను ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో పరామర్శలకు ఇస్తున్న ప్రాధాన్యం.. నేతలను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేయడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి వైసీపీ సీనియర్లు సలహాలు ఇస్తున్నారా? వారు సలహా ఇస్తున్న జగన్ పట్టించుకోవడం లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

Leave a Comment