Balakrishna Cycle Video: నందమూరి బాలకృష్ణ.. సినీ నటుడు మాత్రమే కాదు, ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా ప్రతినిధిగా కూడా సేవలందిస్తున్నారు. బాలకృష్ణ పార్లమెంటులో అడుగుపెట్టిన ఈరోజు చేసిన వినూత్న కార్యాచరణ కాస్త నవ్వులు పూయించింది.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: మహిళల ఉచిత ప్రయాణ పథకం పై కీలక అప్డేట్!
ఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలో టీడీపీ పార్టీ గుర్తైన సైకిల్‌ను ఎక్కి తొక్కలేకపోయిన బాలయ్య వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తమ పార్టీ గుర్తైన పసుపు రంగు సైకిల్‌ను ప్రత్యేకంగా తీసుకువచ్చి బాలయ్యకు అందించారు. అయితే ఈ సైకిల్‌కి ఉన్న హైట్ కారణంగా బాలయ్య బాబు దానిపై ఎక్కలేకపోయారు.
అనుకున్నట్టు సైకిల్‌ను తొక్కలేదు కానీ, వెనుక సీటులో కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చారు. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. “అంత పెద్ద హీరో, అబ్బా సైకిల్ ఎక్కడం రాలేదా?”, “తండ్రి స్థాపించిన పార్టీ గుర్తు అయిన సైకిల్‌నే తొక్కలేరా?” అంటూ కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు.
మరోవైపు బాలయ్య అభిమానులు మాత్రం ఆయన ఉత్సాహాన్ని ప్రశంసిస్తున్నారు. “పార్టీ గుర్తును గౌరవిస్తూ చక్కగా ఫోజులిచ్చారు. ఆయన సైకిల్ తొక్కకపోయినా, పార్టీకి ఇచ్చే గౌరవం చాటి చెప్పింది,” అంటూ భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఏపీ లిక్కర్ స్కాంలో దొరికిన ఆ 11 కోట్లు ఎవరివి?
ఈ సంఘటనతో బాలయ్య మరొక్కసారి వార్తల్లో నిలిచారు. బాలయ్య చేసే ఏ చిన్న చర్యైనా మీడియా, సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. సైకిల్ ఎక్కలేకపోయినా, బాలయ్య స్టైల్‌కి మజా మిగిలిందంటున్నారు అభిమానులు.
ఢిల్లీ పార్లమెంటులో సైకిల్‌తో సందడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ pic.twitter.com/ULezw8e2c0
— Telugu Scribe (@TeluguScribe) July 31, 2025