Youtube: ఆ దేశంలో పిల్లలకు యూట్యూబ్‌ నిషేధం.. ఎందుకో తెలుసా..? – Telugu News | Australia Bans Youtube For Children Under 16 Years, Full Details Here

పెద్దల నుండి పిల్లల వరకు అందరూ సోషల్ మీడియాకు అతుక్కపోతున్నారు. సోషల్ మీడియా లేకపోతే ఉండలేని స్థితికి వచ్చారు. దాని ప్రభావం అన్ని వర్గాల ప్రజలపైనా కనిపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లు యువత, పిల్లలలో బాగా పాపులారిటీ పొందింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నుండి 16 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేయకుండా నిషేధం విధించింది. టిక్‌టాక్, స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ , ఎక్స్‌లను ఆస్ట్రేలియాలో ఇప్పటికే నిషేధించారు.

ఈ-సేఫ్టీ కమిషనర్ సిఫార్సుల తర్వాత ఇప్పుడు యూట్యూబ్‌పై కూడా అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. యూట్యూబ్ ప్రధానంగా వీడియో ప్లాట్‌ఫామ్ అయినప్పటికీ, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల మాదిరిగానే హానికరమైన కంటెంట్‌ను చూపిస్తుందని.. ఇది పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉందని అధికారులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ సదరు యాప్స్ నిబంధనలు పాటించకపోతే రూ.32 మిలియన్ డాలర్ల ఫైన్ విధిస్తామని హెచ్చరించారు. అటు యూట్యూబ్ సైతం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని చెప్పింది.

డిజిటల్ యుగంలో పిల్లల భద్రత, మానసిక ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ నొక్కి చెప్పారు. సోషల్ మీడియా పిల్లలకు ప్రమాదమని తనకు తెలసని ప్రధాని అన్నారు. యువ ఆస్ట్రేలియన్లను రక్షించడానికి తన ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ-సేఫ్టీ కమిషనర్ రిపోర్ట్ ప్రకారం.. 10-15 ఏళ్ల వయస్సు గల నలుగురు ఆస్ట్రేలియన్ పిల్లలలో ముగ్గురు క్రమం తప్పకుండా యూట్యూబ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ కంటే ఎక్కువ పాపులారిటీ పొందింది. 37 శాతం మంది పిల్లలు యూట్యూబ్‌లో హానికరమైన ఆన్‌లైన్ కంటెంట్‌ చూస్తున్నారు. యూట్యూబ్‌కు మినహాయింపును ఇవ్వడం కరెక్ట్ కాదని.. నిషేధం విధిస్తేనే పిల్లలకు మంచిదని నివేదికలో ఉంది. యూట్యూబ్ ఛానల్స్ అకౌంట్‌పై నిషేధం విధించినప్పటికీ పిల్లలు యూట్యూబ్‌ను యాక్సెస్ చేయగలరు. కానీ వారు కంటెంట్‌ను సృష్టించడం, కామెంట్లు చేయడం వంటివి చేయలేరు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Leave a Comment