– మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఈనెల 27వ తేదీన వరంగల్ లో నిర్వహించే విఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ భువనగిరి పట్టణ కార్యాలయంలో సన్నాక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భువనగిరి మాజీ శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరిగిందని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులు, నూతన జిల్లాల ఏర్పాటు, నూతన కలెక్టరేట్ భవనాల నిర్మాణం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. భువనగిరి నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు ఎప్పుడు నేను అందుబాటులో ఉంటూ నియోజకవర్గంను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ 10 సంవత్సరాలు కష్టపడడం జరిగింది కానీ కాంగ్రెస్ నాయకుల మోసపూరిత హామీలకు ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది కానీ 18 నెలల కాలవ్యవధిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకాన్ని మూటకట్టుకోవడం జరిగిందనారు. రాబోవు స్థానిక ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం నేను మీ వెంటే ఉంటా అని కార్యకర్తలకు హామీ ఇవ్వడం జరిగిందని, వరంగల్ లో జరిగే రజతోత్సవ సభలో కెసిఆర్ ని చూడడానికి అతని మాటలు వినడానికి ప్రతి ఒక్కరూ రావడానికి సిద్ధంగా ఉన్నారని మనమందరం కూడా వారిని వరంగల్ సభకు తరలించే విధంగా చూడాలని ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ క్యామ మల్లేశం , భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్లు ఎన్నబోయిన ఆంజనేయులు, పెంట నరసింహ, నువ్వుల ప్రసన్న సత్యనారాయణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు కాజా అజీముద్దీన్, దిడ్డికాడి భగత్ నాయకులు కుశంగల రాజు, చెన్న మహేష్, కడారి వినోద్, తుమ్మల పాండు, చిక్కా ప్రభాకర్ గౌడ్, సుదగాని రాజు, సిద్దుల పద్మ, రత్నపురం పద్మ, బర్రె రమేష్, ఎన్నబోయిన జాంగిర్, తాడూరు బిక్షపతి,తాడం రాజశేఖర్, ఇక్బాల్ చౌదరి, ఇస్మాయిల్, ముజీబ్,నాగు, పెంట నితీష్, నాగారం సూరజ్, సైదులు, ఇండ్ల శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి.. –

Written by RAJU
Published on: