Hindupur Woman Viral Video: ఉద్యోగం కావాలంటే పడుకోవాలి.. వరుసగా రెచ్చిపోతున్న బాలయ్య అనుచరులు

Hindupur Woman Viral Video: నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna).. క్రమశిక్షణకు మారుపేరు. తాను తప్పు చేయరు.. తన వారు తప్పు చేస్తే ఊరుకోరు. అయితే అంతటి పేరు ఉన్న నందమూరి బాలకృష్ణ అనుచరుల ఆగడాలు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో పెరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళ బాలయ్య అనుచరుడిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన ఉద్యోగం ఇప్పించేందుకు లైంగిక వాంఛ తీర్చాలని బాలయ్య అనుచరుడు కోరినట్లు చెబుతోంది. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడంలేదని.. ఈ విషయంలో బాలయ్య తనకు న్యాయం చేయాలని కోరుతోంది. అందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విధుల నుంచి తొలగింపు హిందూపురం( hindupuram ) ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ ముస్లిం మహిళ కాంట్రాక్ట్ కార్మికురాలుగా పనిచేస్తూ ఉండేది. అయితే టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్పత్రి పారిశుధ్య నిర్వహణకు సంబంధించి కాంట్రాక్టర్ మారారు. స్థానిక టిడిపి నేత ఒకరు ఆ కాంట్రాక్టును దక్కించుకున్నారు. ఈ క్రమంలో సదరు ముస్లిం మహిళను విధుల నుంచి తొలగించారు. అయితే తనది పేద కుటుంబమని.. తనను విధుల్లోకి తీసుకోవాలని సదరు మహిళ కోరుతోంది. ఈ క్రమంలో స్థానిక టిడిపి నేతను ఆశ్రయించింది. సదరు టిడిపి నేత ఆసుపత్రి పారిశుధ్య నిర్వహణ కాంట్రాక్టు దక్కించుకున్న బాలయ్య అనుచరుడని సంప్రదించాడు. అయితే ఆయన తన లైంగిక వాంఛ తీర్చితే తిరిగి విధుల్లోకి తీసుకుంటానని చెప్పుకొచ్చాడు. అదే విషయాన్ని ఆ దళారీగా ఉన్న టిడిపి నేత బాధిత మహిళతో చేసిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. విపరీతంగా వైరల్ అయింది.

వీడియో వైరల్..
అయితే తాజాగా సదరు బాధిత మహిళా నేరుగా ఒక వీడియో( video) విడుదల చేశారు. బాలయ్య అనుచరుడు లైంగికంగా తనను వేధిస్తున్నారని.. అక్రమంగా తనను ఉద్యోగం నుంచి తొలగించాలని.. ఉద్యోగం కావాలంటే లైంగిక వాంఛ తీర్చాల్సిందేనని తేల్చి చెబుతున్నారంటూ ఆరోపిస్తోంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య అనుచరుడి తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

Leave a Comment