Ocean Nemo Point Mysteries : సముద్రంలో ఇది కనిపిస్తే బతికి ఉన్నా సచ్చినట్టే!

Ocean Nemo Point Mysteries: ఈ భూమిపై మూడొంతుల నీరే.. ఒక వంతు మాత్రమే నేల ఉంది. అన్ని జీవరాశులకు అనువైనది భూమి. ఆక్సిజన్‌ ఉన్న ఏకైక గ్రహం కూడా ఈ భూమే. అయితే భూమితోపాటు ఇంకా ఏమైనా ఉన్నాయా అని పరిశోధన చేస్తున్నారు. ఇక భూమిపై ఉన్న సముద్రాలు.. అనేక జీవరాశులకు నిలయాలు.. ఈ భూమి మనిషికి అనేక రకాలుగా ఉపాధి కల్పిస్తోంది. నిత్యం సముద్రంపై ఆధారపడి కోట్ల మంది జీవనం సాగిస్తున్నారు. జల మార్గంగా కూడా సముద్రాలు ఉపయోగపడుతున్నారు. అయితే ఈ సముద్రంలో అది కనిపిస్తే మాత్రం మన చచ్చినట్లే.. అదే నిమో పాయింట్‌..

Also Read: సునామీ ముప్పు పక్షులకు ముందే ఎలా తెలుస్తుంది? అమెరికాలో ఏం జరిగిందంటే?

పసిఫిక్‌ మహా సముద్రంలో..
నిమో పాయింట్, పసిఫిక్‌ మహాసముద్రంలో భూమిపై అత్యంత ఒంటరి ప్రదేశం ఇది. దీనిని ‘ఓషియానిక్‌ పోల్‌ ఆఫ్‌ ఇన్‌యాక్సెసిబిలిటీ‘ అని కూడా అంటారు. ఈ ప్రాంతం భూభాగాల నుంచి అత్యంత దూరంగా ఉండటం వల్ల, ఇక్కడ చేరుకోవడం లేదా బతకడం అసాధ్యం. ఈ పాయింట్‌ సమీప భూభాగాలైన డూసీ ద్వీపం, మహేర్‌ ద్వీపం, మోటు నుయ్‌ ద్వీపం నుంచి సుమారు 2,688 కి.మీ. దూరంలో ఉంది. అందుకే దీనిని భూమిపై అత్యంత ఒటరి స్థలంగా గుర్తించారు. ఆసక్తికరం ఏమిటంటే.. ఈ ప్రదేశం నుండి అంతరిక్షంలోని ఉపగ్రహాలు (160 కి.మీ. ఎత్తులో) భూమి కంటే సమీపంగా ఉంటాయి.

నడి సంద్రంలో బతుకు ఆశ.. అత్యాశే!
నిమో పాయింట్‌లో ఉండటం ఒక విపత్కర అనుభవం ఎందుకంటే.. ఈ ప్రాంతం నౌకాయాన రూట్ల నుంచి దూరంగా ఉంది, సహాయం చేరుకోవడం దాదాపు అసాధ్యం. బలమైన గాలులు, 15–18 మీటర్ల ఎత్తైన కెరటాలు ఉంటాయి. సముద్రంలో జీవవైవిధ్యం తక్కువగా ఉండటం వల్ల ఆహారం లేదా ఇతర వనరులు దొరకవు. ఈ ప్రాంతం అంతరిక్ష శిథిలాల ఖననస్థలంగా ఉపయోగపడుతుంది. 4 వేల నుంచి 6 వేల మీటర్ల లోతు ఉన్న అబిస్సల్‌ జోన్‌లో జీవనం అసాధ్యం. ఈ కారణాల వల్ల, ఈ ప్రదేశంలో చిక్కుకుంటే బతుకుపై ఆశలు ఉండవు.

Also Read: నాన్ వెజ్ అంటే మనకే కాదు..యావత్ ప్రపంచానికి ఇష్టమే..ఇంతకీ వేటిని ఎక్కువ తింటున్నారో తెలుసా?

ఉప గ్రాహాల శ్మశానం..
నిమో పాయింట్‌ శాస్త్రీయంగా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది అంతరిక్ష సంస్థలు పాత ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకల శిథిలాలను సురక్షితంగా విసర్జించే స్థలంగా ఉపయోగపడుతుంది. దీనిని ‘స్పేస్‌క్రాఫ్ట్‌ స్మశానం‘ అని పిలుస్తారు, ఎందుకంటే ఇక్కడ మానవ సంచారం ఉండదు. అందుకే ఉపగ్రహాలను ఇక్కడ పడేలా చేస్తారు. దీని పేరు జూల్స్‌ వెర్న్‌ ‘ట్వంటీ థౌజండ్‌ లీగ్స్‌ అండర్‌ ది సీ‘ నవలలోని కెప్టెన్‌ నిమో నుండి వచ్చింది, ఇక్కడ ‘నిమో‘ అనే పదం లాటిన్‌లో ‘ఎవరూ లేని‘ అని సూచిస్తుంది.

Leave a Comment