- ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్న రుతురాజ్ గైక్వాడ్
- యువ బ్యాటింగ్ సంచలనం ఆయుష్ మాత్రేకి అవకాశం
- 9 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 7 లిస్ట్ A మ్యాచ్‌లు ఆడిన మాత్రే

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. రుతురాజ్ స్థానంలో సీఎస్‌కే ఓ సీనియర్ బ్యాటర్‌ని తీసుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా.. 17 ఏళ్ల కుర్రాడికి అవకాశం ఇచ్చింది. అతడే ముంబైకి చెందిన యువ బ్యాటింగ్ సంచలనం ఆయుష్ మాత్రే. ఈ విషయాన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అధికారికంగా ప్రకటించింది.
Also Read: LSG vs CSK: మెరిసిన ధోనీ, దూబే.. 5 ఓటముల తర్వాత చెన్నై విజయం
విజయ్ హజారే ట్రోఫీ 2024లో ముంబై తరఫున ఆయుష్ మాత్రే అరంగేట్రం చేశాడు. కర్ణాటకపై తొలి మ్యాచ్‌లోనే 78 రన్స్ బాదాడు. నాగాలాండ్‌పై 181 పరుగులు, సౌరాష్ట్రపై 148 పరుగులు చేసి అందరి దృష్టిలో పడ్డాడు. ఇక 2025 జనవరిలో అయూష్ రంజీల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మేఘాలయపై తొలి మ్యాచ్ ఆడాడు. మాత్రే 9 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 7 లిస్ట్ A మ్యాచ్‌లలో 962 పరుగులు చేశాడు. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు. రుతురాజ్ గైక్వాడ్‌కు గాయం కావడంతో చెన్నై యాజమాన్యం రూ.30 లక్షల కనీస ధరకు అతడిని జట్టులోకి తీసుకుంది.
🚨LION ALERT ‼️
Mumbai youngster Ayush Mhatre drafted as a replacement for Ruturaj Gaikwad who had suffered an elbow fracture earlier. #WhistlePodu 🦁💛 pic.twitter.com/PGMDH12J9q
— Chennai Super Kings (@ChennaiIPL) April 14, 2025