– క్వారీలో దిగిన ముగ్గురు యువకులు మృతి
నవ తెలంగాణ -మహబూబ్ నగర్
ఈత కోసం క్వారీలో దిగిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో దివిటిపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దివిటిపల్లిలోని డబుల్ బెడ్ రూముల ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు సోమవారం మధ్యాహ్నం సమీపంలో ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద క్వారీలో ఈత నేర్చుకోవడానికి వెళ్లారు. క్వారీలో దిగగానే ఈత రాకపోవడంతో అయ్యప్ప, మహమూద్ నీటిలో మునిగిపోయారు. స్థానికులు కొంతమంది గమనించి వెంటనే క్వారీ దగ్గరికి వెళ్లి విజరు మృతదేహాన్ని బయటకు తీశారు. మిగతా ఇద్దరి మృతదేహాల కోసం గాలిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేపట్టారు.