ABN
, Publish Date – Apr 08 , 2025 | 05:42 AM
పసిడి, వెండి ధరలు అంతర్జాతీయంగా పడిపోతుండటంతో దేశీయంగా కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ మార్కెట్లో బంగారం రూ.91,450కి, వెండి రూ.92,500కి పడిపోయాయి,

-
ఒక్కరోజే రూ.1,550 తగ్గుదలతో రూ. 91,450కి పరిమితమైన తులం
-
కిలో వెండి రూ.3,000 డౌన్
న్యూఢిల్లీ: పసిడి ధరలు ఆల్‌టైం రికార్డు స్థాయిల నుంచి క్రమంగా దిగివస్తున్నాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాముల రేటు సోమవారం రూ.1,550 తగ్గి రూ.91,450కి పరిమితమైంది. 99.5 శాతం స్వచ్ఛత లోహం కూడా అదే స్థాయిలో తగ్గి రూ.91,000గా నమోదైంది. కిలో వెండి ఏకంగా రూ.3,000 తగ్గుదలతో రూ.92,500కు జారుకుంది. వెండి తగ్గడం వరుసగా ఇది ఐదో రోజు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణం. ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ 3,027 డాలర్లు, సిల్వర్ 30 డాలర్లకు జారుకున్నాయి.
Updated Date – Apr 08 , 2025 | 05:49 AM