విజువల్‌ వండర్‌గా ‘ఓదెల 2’

Written by RAJU

Published on:

విజువల్‌ వండర్‌గా ‘ఓదెల 2’కథానాయిక తమన్నా నాగసాధుగా విభిన్న పాత్ర పోషించిన చిత్రం ‘ఓదెల 2’, సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ‘ఓదెల రైల్వే స్టేషన్‌’కి సీక్వెల్‌ ఇది. సంపత్‌ నంది సూపర్‌ విజన్‌లో అశోక్‌ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్‌, సంపత్‌ నంది టీమ్‌వర్క్స్‌పై డి.మధు నిర్మించారు. హెబ్బా పటేల్‌, వశిష్ట ఎన్‌ సింహ ముఖ్య పాత్రలు పోషించారు.
– ఈ సినిమా ఈనెల 17న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ క్రియేటర్‌ సంపత్‌ నంది విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
– ఫస్ట్‌ పార్ట్‌లో హెబ్బా పటేల్‌ చేసిన రాధ క్యారెక్టర్‌ హైలెట్‌ అయింది. ఫస్ట్‌ పార్ట్‌లో ఒక దుష్టశక్తి అంతం అవుతుంది. దాని ఆత్మని కంట్రోల్‌ చేయాలంటే మరో శక్తి కావాలి. శివశక్తి లాంటి క్యారెక్టర్‌ వస్తే ఎలా ఉంటుందని ఆలోచన పుట్టింది. తమన్నా ఈ క్యారెక్టర్‌కి యాప్ట్‌గా ఉంటుందని ఆమెకు చెప్పాను. తనకి కూడా నాగసాధు క్యారెక్టర్‌ చాలా నచ్చింది. ఈ సినిమా కోసం ఆమె ఎండలో చెప్పులు లేకుండా నటించారు. కంప్లీట్‌ శాకాహారిగా మారిపోయారు.
– ఇండియన్‌ సూపర్‌ స్టార్‌ సినిమాల్లో ఉండే క్వాలిటీ గ్రాఫిక్స్‌ ఈ సినిమాలో ఉన్నాయి. దాదాపు 150 మంది విఎఫ్‌ఎక్స్‌ నిపుణులు గత ఆరు నెలలుగా ఈ సినిమా కోసం వర్క్‌ చేశారు. ఈ సినిమాలో విజువల్స్‌ అన్ని చాలా కొత్తగా ఉంటాయి. విజువల్‌ వండర్‌గా ఆడియన్స్‌కి చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. అజినీస్‌ లోక్‌నాథ్‌ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరు అద్భుతం.
– డైరెక్టర్‌ అశోక్‌ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన్ని డైరెక్టర్‌ చేయాలనే ‘ఓదెల’ సినిమా తీశాను. ఇప్పుడు ఈ సినిమాని కూడా చాలా అద్భుతంగా తీశాడు. ప్రొడ్యూసర్‌ మధు చాలా ప్యాషన్‌ ఉన్న నిర్మాత. ఈ సినిమా ఆయన ఫ్యాషన్‌తోనే సాధ్యపడింది. ఒక సంకల్ప బలంతో ఆయన ఈ సినిమా చేశారు.
– వశిష్ట వాయిస్‌ చాలా బాగుంటుంది. అందుకే పార్ట్‌ వన్‌లో తనతోనే డబ్బింగ్‌ చెప్పించాను. ఈ సినిమాలో కూడా తన నటన చాలా అద్భుతంగా ఉంటుంది.
ట్రైలర్‌లో అరుంధతి, పశుపతి ఛాయలు కనిపించాయనే కామెంట్స్‌ వచ్చాయి. ఈ సినిమాకి దానికి పోలిక లేదు. ఈ రెండు కూడా దేనికవే ప్రత్యేకమైనవి. ఇది ఒక ప్రేతాత్మకి, పంచాక్షరి మంత్రానికి మధ్య జరిగే యుద్ధం.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights