టీజీ టెట్‌ 2025,TS TET 2025 Reside : తెలంగాణ టెట్‌ రిజిస్ట్రేషన్‌.. tgtet.aptonline.in ద్వారా అప్లయ్‌ చేసుకోవచ్చు – ts tet 2025 registration begins from april 15 at tgtet aptonline in

Written by RAJU

Published on:

Telangana TET 2025 : తెలంగాణ టెట్‌ 2025 షెడ్యూల్‌ వచ్చేసింది. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కూడా ఏప్రిల్‌ 15 నుంచి ప్రారంభం కానుంది. పూర్తి షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

Samayam Teluguతెలంగాణ టెట్‌ 2025
తెలంగాణ టెట్‌ 2025

TS TET 2025 Registration : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET 2025) నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్‌15 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ చేసుకునే అవకాశం కల్పించింది విద్యాశాఖ. ఈ మేరకు శుక్రవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, టెట్ చైర్మన్ ఈవీ నర్సింహారెడ్డి, టెట్ డైరెక్టర్ రమేష్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. పూర్తి వివరాలతో కూడిన షెడ్యూల్‌ను ఏప్రిల్‌ 15న విడుదల చేయనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ https://tgtet.aptonline.in/tgtet/ ద్వారా చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే వెబ్‌సైట్‌ నుంచి అప్లికేషన్‌ లింక్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అలాగే.. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు ఆన్ లైన్లో ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. ఎగ్జామ్ ఫీజు ఒక పేపర్ కు రూ.750, రెండు పేపర్లు రాయాలనుకుంటే రూ.1000 ఫీజు ఉంటుందని పేర్కొన్నారు. టీజీ టెట్ ఎగ్జామ్స్ జూన్ 15 నుంచి 30 తేదీల మధ్యలో నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రతిరోజూ రెండు సెషన్లలో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఫస్ట్ సెషన్‌లో ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు.. సెకండ్ సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు. జూన్ 9వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. కాగా.. జులై 22వ తేదీన టీజీ టెట్‌ 2025 ఫలితాలు విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఉండనుంది.

కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights