April 14 School Holiday : ఏప్రిల్ నెలలో విద్యాసంస్థలకు సెలవులు బాగా వస్తున్నాయి. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా స్కూళ్లకు సెలవు ఉంటుంది. అలాగే ఈ వారంలోనే..

ఇటీవల కేంద్ర ప్రభుత్వ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని కేంద్ర ప్రభుత్వం (Government of India) పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. సమాజానికి, రాజ్యాంగానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14వ తేదీన ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు ఏప్రిల్ 14న సెలవు ఉండనుంది. అయితే.. ఈ వారంలోనే ఏప్రిల్ 18న గుడ్ ఫ్రైడే ఉంది. ఆరోజు స్కూళ్లకు సెలవు ఉండనుంది.
ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు :
తెలంగాణలో ఈసారి ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23, 2025 విద్యా సంవత్సరానికి చివరి పనిదినం. మళ్లీ జూన్ 12వ తేదీన పాఠశాలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ వేసవి సెలవులకు సంబంధించి స్పష్టత ఇచ్చింది. వేసవి సెలవులపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 24 నుంచి రాష్ట్రంలోని అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్ (Summer Holidays) ఇస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 12వ తేదీన స్కూళ్లు పునఃప్రారంభం అవుతాయని స్పష్టం చేసింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు వెల్లడించింది. అన్నీ స్కూళ్లు ఈ ఆదేశాలు పాటించాలని సూచించింది.
ఇంటర్ కాలేజీలకు జూన్ 1వ తేదీ వరకు సమ్మర్ హాలిడేస్ :
మరోవైపు తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. తెలంగాణలోని అన్ని జూనియర్ కాలేజీలకు సమ్మర్ హాలిడేస్ (Summer Holidays) ప్రకటించింది. ఇటీవలే వార్షిక పరీక్షలు ముగియగా.. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 1వ తేదీ వరకు అన్ని ఇంటర్ కాలేజీలకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయని.. తిరిగి జూన్ 2వ తేదీన కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయని పేర్కొంది. అన్ని కాలేజీలు ఈ ఉత్తర్వులను తప్పక పాటించాలని.. వేసవి సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డ్ హెచ్చరించింది.