Weekly Horoscope | ఈ వారం రాశి ఫలాలు.. మార్చి 13నుంచి 19 వరకు-Namasthe Telangana

Written by RAJU

Published on:

కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. నలుగురికి ఉపయోగపడే పనులను చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. రావలసిన డబ్బు వస్తుంది. ఇంట్లో వాళ్లతో చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. భూ లావాదేవీలు కలిసివస్తాయి. వ్యవసాయదారులకు అనుకూల సమయం. ప్రయాణాల వల్ల కార్యసిద్ధి ఉంది.


Weekly Horoscope | ఈ వారం రాశి ఫలాలు.. మార్చి 13నుంచి 19 వరకు-Namasthe Telangana

మేషం

కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. నలుగురికి ఉపయోగపడే పనులను చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. రావలసిన డబ్బు వస్తుంది. ఇంట్లో వాళ్లతో చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. భూ లావాదేవీలు కలిసివస్తాయి. వ్యవసాయదారులకు అనుకూల సమయం. ప్రయాణాల వల్ల కార్యసిద్ధి ఉంది. ఆరోగ్యంగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈశ్వరారాధన మేలుచేస్తుంది.

వృషభం

సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెద్దల సహకారం అందుతుంది. పనివారితో చిన్న చిన్న ఇబ్బందులు ఉండవచ్చు. డబ్బు విషయంలో జాగ్రత్తలు అవసరం. దత్త స్తోత్రాలు పఠించండి.

మిథునం

గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. అన్ని విషయాలలో శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఇంట్లో సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. వృథా ఖర్చులు ఉంటాయి. వ్యాపారులకు భాగస్వాములతో మనస్పర్ధలు వస్తాయి. రాబడి మార్గాలపై దృష్టి సారించడం అవసరం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం

మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. మానసిక సంతృప్తి ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. రాజకీయ వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. శ్రమ అధికమైనప్పటికీ అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

సింహం

ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. పెట్టుబడులు కలిసివస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. పనుల్లో కొంత ఆలస్యం జరుగుతుంది. బంధువర్గంతో ఇబ్బందులు ఉంటాయి. భాగస్వాముల వల్ల వ్యాపారంలో చికాకులు తలెత్తుతాయి. వారాంతానికి అన్నీ సర్దుకుంటాయి. పెద్దల సలహాలు పాటించడం అవసరం. లక్ష్మీధ్యానం శుభప్రదం.

కన్య

ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో జాప్యం జరగవచ్చు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల అండదండలు లభిస్తాయి. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలుచేస్తుంది.

తుల

గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. పెద్దల సలహాలు పాటించడం అవసరం. ఉద్యోగులకు తాత్కాలిక అనుకూలత ఉంది. కుటుంబంలో కలహ వాతావరణం ఉంటుంది. ఓపిక అవసరం. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వ్యాపారులకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధువర్గంతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అనవసరమైన విషయాల జోలికి వెళ్లకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. గణపతి ఆరాధన శుభప్రదం.

వృశ్చికం

రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించండి. కోర్టు కేసులలో సానుకూల ఫలితాలు ఉంటాయి. దేవతా గురుభక్తి పెరుగుతుంది. నలుగురికి సాయపడే పనులు చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. సూర్యారాధన శ్రేయస్కరం.

ధనుస్సు

నూతన నిర్మాణ పనులు మొదలుపెడతారు. నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభిస్తారు. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. బంధువర్గం మూలంగా కార్యసిద్ధి ఉంది. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. శ్రద్ధగా పనులు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

మకరం

ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి, స్థానచలన సూచనలు ఉన్నాయి. ఉత్సాహంతో పనిచేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. నలుగురికి సాయపడతారు. స్థిరాస్తుల ద్వారా ఆదాయం వస్తుంది. శివారాధన మేలుచేస్తుంది.

కుంభం

రావలసిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. అనుకున్న పనులు నెమ్మదిగా నెరవేరుతాయి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. బంధువర్గంతో కార్య సాఫల్యం ఉంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సమస్యలను సంయమనంతో పరిష్కరించుకుంటారు. ఖర్చుల నియంత్రణ అవసరం. రామాలయాన్ని సందర్శించండి.

మీనం

ప్రయాణాలు కలిసివస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధువులతో చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. దక్షిణామూర్తిని ఆరాధించండి.

-గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్‌ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్‌. సెల్‌: 9885096295
ఈ మెయిల్‌ : nirmalsiddhanthi@yahoo.co.in

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights