Video: ఫ్యాన్‌ రిపేర్‌ చేయడానికి వచ్చిన వ్యక్తితో ప్రేమలో పడింది… సినిమా కథను మించిన లవ్‌స్టోరీ..

Written by RAJU

Published on:

ప్రేమ.. ఎలా పుడుతుందో, ఎప్పుడు పుడుతుందో ఎవ్వరికి తెలియదు. అదో స్పందన. మెరుపులా మెరుస్తుంది, జీవితాల్లో వెలుగులు నింపుతుంది. బాగా డబ్బున్న అమ్మాయికి ఓ పేద కుర్రాడి మీద మనసు పడొచ్చు. వర్ణంతో సంబంధం లేకుండా అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ చిగురించవచ్చు. ఇలాంటి స్టోరీలకు సంబంధించి అనేక సినిమాలు, సీరియల్స్‌ అలరిస్తుంటాయి. నిత్య జీవితంలో జరిగిన సంఘటనలు సోషల్‌ మీడియాలో ఆకట్టుకుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.

బీహార్‌లో ఓ యువతి తన ఇంటికి సీలింగ్ ఫ్యాన్ రిపేర్ చేయడానికి వచ్చిన వ్యక్తితో ప్రేమలో పడింది. వారి విచిత్రమైన ప్రేమకథకు నెటిజన్స్‌ ఫిదా అవుతున్నారు. ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారి మధ్య ప్రేమ ఎలా పుట్టిందో చెప్పుకొచ్చాడు ఎలక్ట్రిషియన్‌. ఆ యువతి తన ఇంటిలో ఫ్యాన్ పనిచేయడం లేదని ఫోన్‌ కాల్‌ చేసింది. ఒకసారి ఫ్యాన్ రిపేర్ చేసిన తర్వాత, ఆ మహిళ తన ఫోన్ నంబర్‌ను అడిగి తీసుకుంది. ఫ్యాన్ మళ్లీ రిపేర్‌కు వస్తే ఫోన్‌ చేస్తానని చెప్పి ఫోన్‌ నెంబర్‌ అడిగిందని చెప్పారు.

మరోవైపు, ఆ మహిళ కూడా తన భావోద్వేగాలను స్పష్టంగా చెప్పింది. తొలి నుంచి అతని మీద ఇష్టం పెంచుకకున్నానని దానిని చూపించలేదని వెల్లడించింది. అతను లేకుండా నేను దేనిపైనా దృష్టి పెట్టలేకపోయాను. నేను అతనిని గాఢంగా ప్రేమించాను అని ఆ మహిళ పేర్కొంది. మొదట్లో, అతను తనపై పెద్దగా దృష్టి పెట్టలేదని ఆమె పేర్కొంది. అతన్ని తన ఇంటికి ఆహ్వానించడానికి కారణాలను వెతికేదానిని అని చెప్పింది. ఫ్యాన్, లైట్ లేదా డిష్ టెలివిజన్ వంటివి రిపేర్‌కు వచ్చాయని తరచూ కాల్‌ చేశాను. అలా మా మధ్య బంధాన్ని ఏర్పరచాయని అన్నారు. చివరికి వివాహం చేసుకున్నారు.

వారి ఇంటర్వ్యూ వీడియోను X లో షేర్ చేశారు. వారి ప్రేమ కథపై నెటిజన్స్‌ ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. ఇద్దరూ చాలా ముద్దుగా ఉన్నారు అని వ్యాఖ్యానిస్తున్నారు. హృదయపూర్వక ప్రేమకథ. దీని ఆధారంగా భోజ్‌పురిలో సినిమా తీయొచ్చు అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.

వీడియో చూడండి:

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights