
నవతెలంగాణ – తొగుట
బర్దు ప్లూ నివారణ కోసం తగు జాగ్రత్తలు తీసుకుం టున్నామని జిల్లా పశు సంవర్ధక, పశు వైద్య శాఖ అధికారి అశోక్ కుమార్ తెలిపారు. గురువారం అధికారి ఫోన్ ద్వారా తెలిపిన సమాచారం ప్రకారం కాన్గల్ గ్రామ సమీపంలో లేయార్ కోళ్ల ఫారంలో బర్దు ప్లూ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అధికారి తెలిపిన సమాచారం ప్రకారం కోళ్లను చంపి పూడ్చి పెట్టే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. రెండవ రోజు వరకు 65 వేల కోళ్లను శడ్ల నుండి తీసి 5 మీటర్ల లోతు గొయ్యి తీసి కోళ్లను అందులో వేసి వాటిపై సున్నం చల్లి పూడ్చి వేశామని తెలి పారు. పశు వైద్య సిబ్బంది, లేబర్ సహకారం శడ్ లో ఉన్న కోళ్లను తీసివేస్తున్నామన్నారు. ఇందులో పాల్గొన్న వారికి ఎలాంటి వైరస్ చేయకుండా పీపీ కిట్లు క్లౌజులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నా మన్నారు. వారికి వారం రోజులు సరిపడా మెడి సిన్ అందిస్తున్నామన్నారు. అన్ని జాగ్రత్తలు తీస్తూనే వాటిని తొలగించే పనిని పూర్తి చేస్తున్నా మన్నారు. ఇంకా రెండు రోజుల వరక షెడ్యూల్లో ఉన్న కోళ్లు పూర్తిగా తీసివేస్తామన్నారు. అనం తరం మూడు నాలుగు నెలల వరకు అందులో ఎలాంటి కోళ్లను వేయకుండా జాగ్రత్తలు తీసుకోవా లన్నారు. షెడ్ లో ఉన్న వైరస్ పూర్తిగా పోవడానికి మందులు పిచికారి చేయాలని సూచించారు. ఇందులో పని చేసే వారికి తగు జాగ్రత్తలు తీసుకు నేందుకు వైద్య సిబ్బంది, ఎలాంటి ఇబ్బంది కలగ కుండా చూసుకోవడానికి పోలీసులు ఇబ్బంది సహ కారంతో ఈ కోళ్లను తీసివేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఈ కోళ్ల ఫారం కిలోమీటర్ పరిధిలో ఎలాంటి కోళ్ల ఫారం లేకపోవడం మంచి విషయం అన్నారు. అలా ఉంటే మరింత ఇబ్బంది కలిగి ఉండేదని చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో ఎక్కడ కూడా వైరస్ సోకినట్లు సమాచారం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న పశ్చిమగోదావరి జిల్లా శాఖలో పనిచేస్తున్న వారు పాల్గొన్నారని తెలిపారు.