సోంపు గింజలు తెలియని వారుండరు. ఈ మసాలా దినుసు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. కానీ మీకు తెలుసా? సోంపుతో బెల్లం తినడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చట. నిపుణులు ఇదే చెబుతున్నారు.
బెల్లం, సోంపు గింజలు.. విడివిడిగా వాటి స్వంత ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. కానీ ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.
బెల్లం, సోంపు శారీరక బలహీనతను తగ్గించి శరీర బలాన్ని పెంచుతాయి. ఇవి శరీర అలసట, బద్ధకం, విచారం వంటి లక్షణాలను తగ్గించి, తక్షణమే ఉపశమనం అందిస్తుంది. ఇది రక్తహీనత ఉన్నవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంట్లో కూడా ప్రయత్నించవచ్చు.
సోంపు, బెల్లం ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను నివారించవచ్చు. అలాగే రెండింటి కలయిక మహిళలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది పీరియడ్స్ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.
వీటన్నింటితో పాటు, జలుబు, దగ్గుతో బాధపడేవారికి కూడా ఇది చాలా మంచిది. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీన్ని రోజూ కొద్ది మొత్తంలో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు.