- తమిళనాడు గవర్నర్‌కు సుప్రీం ధర్మాసనం చీవాట్లు
- బిల్లులు ఆమోదించకుండా నిలిపివేయడంపై అసహనం
- ఈ చర్య చట్ట విరుద్ధం అంటూ ధర్మాసనం వ్యాఖ్య

తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్.రవికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 10కిపైగా బిల్లులను నిలిపివేయడంపై తీవ్రంగా తప్పుపట్టింది. ఈ చర్య చట్ట విరుద్ధం అంటూ సుప్రీం ధర్మాసనం చీవాట్లు పెట్టింది. బిల్లులు నిలిపివేసిన తేదీ దగ్గర నుంచి ఆమోదం పొందినట్లు పరిగణించబడుతుందని జస్టిస్ జెబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో స్టాలిన్ ప్రభుత్వం ఘన విజయం సాధించింది.
ఇది కూడా చదవండి: Love Marriage: ప్రేమించి పెళ్లి చేసుకుంది.. 15 రోజులకే భర్తకు దిమ్మతిరిగే షాకిస్తూ..
స్టాలిన్ ప్రభుత్వం పంపించిన 10 కీలక బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ ఆర్ఎన్.రవి అడ్డుకున్నారు. ఈ చర్యను స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా విచారించిన న్యాయస్థానం.. గవర్నర్ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. గవర్నర్ చర్య చట్ట విరుద్ధం, ఏకపక్షం అంటూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. గవర్నర్ చర్యలు పక్కన పెడుతున్నట్లు కోర్టు పేర్కొంది.
ఇది కూడా చదవండి: Trump-Musk: చైనా సుంకాలపై మస్క్ అభ్యంతరం.. ట్రంప్‌నకు కీలక సూచన
10 బిల్లులను రిజర్వ్ చేయాలని రాష్ట్రపతికి గవర్నర్ సూచించారు. కీలక బిల్లులు ఆమోదం పొందక పోవడంతో స్టాలిన్ ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానాన్ని ప్రభుత్వం ఆశ్రయించడంతో సంచలన తీర్పు వెలువరించింది. గవర్నర్ చర్యను పక్కన పెడుతూ.. గవర్నర్ నిలిపివేసిన దగ్గర నుంచి ఆమోదం పొందినట్లుగా సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
ఇది కూడా చదవండి: Brahma Kumaris Chief: బ్రహ్మకుమారిస్ చీఫ్ దాది రతన్ మోహని కన్నుమూత..
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన తర్వాత గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను.. మళ్లీ రెండోసారి ప్రభుత్వం ఆమోదించి పంపితే గవర్నర్ ఆమోదించినట్లుగా పరిగణించాలని న్యాయస్థానం తెలిపింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను శాశ్వతంగా గవర్నర్లు తమ దగ్గర ఉంచుకోలేరని తేల్చి చెప్పింది. అయినా బిల్లులను ఆమోదించకుండా.. రాష్ట్రపతికి పంపించడం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించినట్లుగా కనిపిస్తుందని వ్యాఖ్యానించింది. 2020, జనవరి నుంచి 12 బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతికి సిఫార్సు చేయడం ఇది కచ్చితంగా చట్ట విరుద్ధమని సుప్రీం ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.