
రామ్ ప్రకాష్ గున్నం హీరోగా నటిస్తూ, తెరకెక్కించిన చిత్రం ‘చెరసాల’. శ్రీజిత్, నిష్కల, రమ్య ముఖ్య పాత్రలు పోషించారు. ఎస్ రారు క్రియేషన్స్ బ్యానర్ పై కథ్రి అంజమ్మ సమర్పణలో కథ్రి అంజమ్మ, షికార దీన్ని నిర్మించారు. ఈ మూవీ ఈనెల 11న రాబోతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్, హీరో రామ్ ప్రకాష్ గున్నం మాట్లాడుతూ, ‘మంచి కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రాబోతోంది. కథ చెప్పిన వెంటనే నిర్మాతలు అంగీకరించారు. శ్రీజిత్, నిష్కల అద్భుతంగా నటించారు. ఓ బంధం ఎలా ఉండాలి?, రిలేషన్ షిప్‌లో ఎలా ఉండాలి?, ఎలా ఉండకూడదు అనే పాయింట్స్‌ను ఇందులో చూపించాను. మంచి ఎమోషన్స్‌తో పాటు చక్కని వినోదం కూడా ఉంటుంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా మా చిత్రం ఉంటుంది. మా సినిమాను అందరూ చూసి ఆదరించండి’ అని తెలిపారు. ‘సినిమా అద్భుతంగా వచ్చింది. నేను కన్నడలో ఇది వరకు సినిమాలు చేశాను. నన్ను నమ్మి మా దర్శకుడు నాకు అవకాశం ఇచ్చారు. ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని రావాలి’ అని హీరో శ్రీజిత్ చెప్పారు.