AP Rains: ఎండ, ఉక్కపోత.. తాజాగా వర్షం.. ఏపీలో చిత్రవిచిత్ర వాతావరణం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో – Telugu Information | Intense warmth and dry climate more likely to prevail in Andhra Pradesh for subsequent three days

Written by RAJU

Published on:

బుధవారం (09-03-25) అల్లూరి సీతరామరాజు జిల్లా రంపచోడవరం, ఏలూరు జిల్లా పోలవరం, వేలేరుపాడు మండలాల్లో తీవ్రవడగాలులు(3) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రేపు వడగాలులు(25) వీచే అవకాశం ఉన్న మండలాలు అల్లూరి సీతారామరాజు జిల్లా-6, తూర్పుగోదావరి-1, ఏలూరు-5, ఎన్టీఆర్-2, గుంటూరు-9, పల్నాడు-2 మండలాల్లో వడగాలులు (25) వీచే అవకాశం ఉందన్నారు. గురువారం 56 మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉందన్నారు. మంగళవారం నంద్యాల జిల్లా దొర్నిపాడు, వైఎస్సార్ జిల్లా మద్దూరులో 41.5°C, కర్నూలు జిల్లా కామవరం 40.7 C, పల్నాడు జిల్లా రావిపాడులో 40.6°C, ప్రకాశం జిల్లా దరిమడుగలో 40.6°C, అల్లూరి సీతారామరాజు ఎర్రంపేట 40.3°C, చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 40.1°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు. 25 ప్రాంతాల్లో 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు వెల్లడించారు.

ఎండతీవ్రంగా ఉండి బయటకు వెళ్లేప్పుడు తలకు టోపి, కర్చీఫ్ కట్టుకోవాలి, గొడుగు ఉపయోగించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని సూచించారు.

ఐఎండి సూచనల ప్రకారం నైరుతి మరియు దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఇది వచ్చే 24 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత, ఇది ఉత్తర-ఈశాన్య దిశగా తిరిగి వచ్చి ఆ తదుపరి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడనున్నట్లు తెలిపారు. రేపు, ఎల్లుండి అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందన్నారు. శుక్రవారం (11తేది) ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights