- ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య మ్యాచ్.
- ఆకాశమే హద్దుగా చెలరేగిన ఎల్ఎస్జి బ్యాటర్లు.
- నిర్ణిత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్.
- కేకేఆర్ టార్గెట్ 239.

LSG Vs KKR: నేడు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పై భారీ స్కోర్ నమోదు చేసింది. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఫీల్డింగ్ ఎంచుకోవడంతో లక్నో బ్యాటింగ్ ప్రారంభించింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణిత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ లో ప్రధానంగా మిచెల్ మార్ష్ 48 బంతుల్లో, 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 81 పరుగులు, నికోలస్ పూరన్ 36 బంతుల్లో, 7 ఫోర్లు, 8 సిక్సర్లు 87 నాటౌట్ లతో భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాయి. ఇక ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఆయ్డెన్ మార్క్రమ్ 28 బంతుల్లో 47 పరుగులు చేసి దూకుడుగా ఆడి అవుట్ అయిన తర్వాత మార్ష్, పూరన్ కలిసి రెండో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో అబ్దుల్ సమద్ 6 పరుగులు చేయగా, డేవిడ్ మిల్లర్ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
Also: UP: శివానీగా మారిన షబ్నమ్.. భర్త, ముగ్గురు పిల్లల్ని విడిచిపెట్టి ఇంటర్ విద్యార్థితో పెళ్లి..
ఇక మరోవైపు కేకేఆర్ బౌలింగ్ విభాగం పూర్తిగా నిరాశ పరిచింది. హర్షిత్ రాణా 4 ఓవర్లలో 51 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అలాగే ఆండ్రే రస్సెల్‌కు ఒక వికెట్ దక్కింది. మిగతా బౌలర్లు ఎవరూ వికెట్లు తీయలేకపోయారు. చూడాలి మరి కేకేఆర్ తమ సొంత గ్రౌండ్ లో భారీ స్కోర్ ను సాధించి విజయం సాధిస్తుందో లేదో.