- రెండో భర్త, ముగ్గురు పిల్లల్ని వదిలి ఇంటర్ విద్యార్థితో పెళ్లి..
- పెళ్లి కోసం షబ్నమ్ పేరును శివానీగా మార్చుకున్న మహిళ..

UP: ఉత్తర్ ప్రదేశ్ అమ్రోహాలో 26 ఏళ్ల షబ్నమ్ అనే మహిళ, ఇంటర్ విద్యార్థితో సంబంధం పెట్టుకుని, అతడిని పెళ్లి చేసుకుంది. తన రెండో భర్త, ముగ్గురు పిల్లల్ని వదిలి అతడిని వివాహమాడింది. దీనిపై స్థానికంగా చాలా విమర్శలు వస్తున్నాయి. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్, మతాల నేపథ్యం, షబ్నమ్ పిల్లల్ని, భర్తని విడిచిపెట్టాలనే నిర్ణయం కారణంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శివ అనే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న యువకుడిని పెళ్లి చేసుకునేందుకు షబ్నమ్ తన పేరుని శివానీగా మార్చుకుంది. తాము ఇద్దరం తమ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని, ఇద్దర సంతోషంగా ఉన్నామని, తమిద్దరం మేజర్లమని, మా జీవితాల్లో ఎవరూ జోక్యం చేసుకోకూడదని షబ్నమ్ కోరింది.
Read Also: Redmi Watch Move: 2.07 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 24 రోజుల బ్యాటరీ లైఫ్తో రెడ్‌మీ నుంచి రాబోతున్న మరో స్మార్ట్‌వాచ్!
నివేదిక ప్రకారం.. షబ్నమ్, శివకు సంబంధం ఉంది. ఇది రెండు కుటుంబాల మధ్య ఉద్రిక్తతకు కారణమైంది. దీంతో కమ్యూనిటీ పంచాయతీ ఈ కేసులో జోక్యం చేసుకుంది. చర్చించిన తర్వాత షబ్నమ్ తనకు నచ్చిన చోట ఉండవచ్చనే పంచాయతీ తీర్పు చెప్పింది. షబ్నమ్‌కి ఇది మూడో వివాహం.
8 ఏళ్ల క్రితం అలీఘర్‌కి చెందిన సాయిద్ నాగ్లితో పెళ్లి జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకుంది. అయితే, ఏడాది క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడికి గాయాలై, వికలాంగుడు అయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో, అదే ప్రాంతానికి చెందిన శివ అనే యువకుడికి షబ్నమ్ దగ్గరైంది. చివరకు ఈ జంట ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఈమె పిల్లలు మాజీ భర్తతో నివసిస్తున్నారు.