KKR vs LSG, IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం జరుగుతోన్న తొలి మ్యాచ్‌లో కోల్‌కతా లైట్ రైడర్స్‌కు లక్నో సూపర్ జెయింట్స్ 239 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లక్నో 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది.
నికోలస్ పూరన్ 36 బంతుల్లో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిచెల్ మార్ష్ 81 పరుగులతో అర్ధ సెంచరీ చేశాడు. ఐడెన్ మార్క్రమ్ 47 పరుగులు చేశాడు. హర్షిత్ రాణా 2 వికెట్లు పడగొట్టాడు. ఆండ్రీ రస్సెల్ ఒక వికెట్ పడగొట్టాడు.
రెండు జట్ల ప్లేయింగ్ 11..
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే (కెప్టెన్), సునీల్ నరైన్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా.
లక్నో సూపర్ జెయింట్స్: రిషబ్ పంత్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ రాఠీ, అవేష్ ఖాన్, ఆకాశ్ దీప్.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..