LSG Vs KKR: KKR received the toss and elected Bowling First match full particulars are

Written by RAJU

Published on:


  • కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్ల మధ్య మ్యాచ్,
  • టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్.
LSG Vs KKR: KKR received the toss and elected Bowling First match full particulars are

LSG Vs KKR: ఐపీఎల్ చరిత్రలోనే మొదటిసారి మంగళవారం నాడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే, దీనికి కారణం లేకపోలేదు. ముందుగా విడుదల చేసిన ఐపీఎల్ 2025 షెడ్యూల్ ప్రకారం.. నేడు ఒక్క మ్యాచ్ మాత్రమే ఉంది. అదికూడా చండీగఢ్ వేదికగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య షెడ్యూల్ జరిగింది. కాకపోతే, ఏప్రిల్ 6న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ నేడు మధ్యాహ్నం జరగనుంది. ఎందుకంటే, శ్రీరామనవమి వేడుకలు ఉన్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్ల విషయం కారణంగా ఐపీఎల్ 2025 షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చేయాల్సి వచ్చింది.

ఇక నేడు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కేకేఆర్ రెండు గెలిచి, రెండు ఓడిపోయింది. అజింక్య రహానె నేతృత్వంలోని ఈ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. గత మ్యాచ్‌లో కోల్‌కతా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. మరోవైపు, రిషబ్ పంత్ కెప్టెన్సీలోని LSG రెండు విజయాలు, రెండు ఓటములతో ఆరో స్థానంలో ఉంది. గత మ్యాచ్‌లో లక్నో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. అయితే, ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడైన పంత్ నాలుగు ఇన్నింగ్స్‌లలో కేవలం 19 పరుగులు మాత్రమే చేయడంతో జట్టు ఇబ్బందులకు గురవుతుంది. దీనితో అందరి చూపు పంత్ పైనే ఉంది. ఇక నేటి మ్యాచ్ లో ప్లేయింగ్ XI వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

కోలకతా నైట్ రైడర్స్ (KKR):
క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రే రస్సెల్, రమందీప్ సింగ్, వైభవ్ అరోరా, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

KKR ఇంపాక్ట్ ప్లేయర్లు:
మనీష్ పాండే, అంగ్కృష్ రఘువంశీ, అనుకుల్ రాయ్, రోవ్‌మాన్ పౌవెల్, లవ్‌నిత్ సిసోడియా

లక్నో సూపర్ జెయింట్స్ (LSG):
మిచ్ మార్ష్, ఐడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, ఋషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ బడోనీ, అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, షార్దూల్ ఠాకూర్, ఆకాశ్ దీప్, అవేశ్ ఖాన్, దిగ్వేశ్ రాథీ

LSG ఇంపాక్ట్ ప్లేయర్లు:
రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, షాబాజ్ అహ్మద్, మ్యాథ్యూ బ్రీట్జ్కే, హిమ్మత్ సింగ్.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights