Indiramma Homes: రూ.5 లక్షలతో 418 చదరపు అడుగుల్లో ఇందిరమ్మ ఇళ్లు.. మోడల్ ఇళ్లను నిర్మించిన గృహనిర్మాణ సంస్థ

Written by RAJU

Published on:

Indiramma Houses: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ళ పనులను వేగవంతం అయ్యాయి. లబ్ధిదారులకు అవగాహన కల్పించి పనులు శరవేగంగా పూర్తి చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్ లో గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో 418 చదరపు అడుగుల్లో ఐదు లక్షల వ్యయంతో సింగిల్ బెడ్ రూమ్, హాల్, కిచెన్, లోపల బయట బాత్ రూమ్ ల సౌకర్యంతో ఇందిరమ్మ మోడల్ ఇల్లు నిర్మించారు. త్వరలో వీటిని ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. మోడల్ ఇందిరమ్మ ఇల్లును చూపించి లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్ళను పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights