రావాల్సిన నిధులు ఏమయ్యాయి..
‘ఢిల్లీ ఎన్నికల కోసం యుమన నదికి నిధులు కేటాయించారు. హైదరాబాద్ మెట్రో, మూసి రివర్‌ను కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు. విభజన హామీలు నెరవేర్చలేదని మీకు ఒక్క సారి అవకాశం ఇవ్వాలా? రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాలు, నిధుల విడుదలలో అన్యాయం చేస్తున్నందుకు.. మీకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలా? రాష్ట్రానికి 11 ఏండ్లుగా అన్నింట్లో గుండు సున్నా ఇస్తున్నందుకు మీకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలా?’ అని మహేశ్ గౌడ్ ప్రశ్నించారు.