Telangana Authorities Expresses Concern Over Pretend Marketing campaign on HCU Land, Excessive Court docket Listening to Deferred to April 24

Written by RAJU

Published on:

  • HCU భూ వివాదంపై హైకోర్టు విచారణ
  • ఈ నెల 24కి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు.
Telangana Authorities Expresses Concern Over Pretend Marketing campaign on HCU Land, Excessive Court docket Listening to Deferred to April 24

HCU Case: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (HCU) భూముల విషయంలో ఇటీవల కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ఫేక్ వీడియోలు, తప్పుడు ఫోటోలను ప్రసారం చేస్తూ కావాలనే వివాదం సృష్టిస్తున్న దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఫేక్ ప్రచారంలో యూనివర్సిటీ భూములను అక్రమంగా ఆక్రమించారని, పర్యావరణాన్ని ధ్వంసం చేశారనీ, వన్యప్రాణులకు నష్టం వాటిల్లిందంటూ ఊహాగానాలు వ్యాప్తి చెయ్యడం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా స్పందిస్తూ, ఈ తప్పుడు ప్రచారంపై చట్టపరంగా కోర్టుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. దీనితో ఆ కేసు నేడు విచారణ చేపట్టారు.

Read Also: MI vs RCB: బుమ్రా వేసిన తొలి బంతికే ఫోర్‌ లేదా సిక్స్‌ కొడతా: టిమ్‌ డేవిడ్

ఇక HCU భూ వివాదం సంబంధించిన కేసుపై ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై హైకోర్టు విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. డివిజన్ బెంచ్‌ వ్యాఖ్యానిస్తూ, ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నదని పేర్కొంది. అలాగే కోర్టుకు కౌంటర్, రిపోర్ట్‌ను ఈ నెల 24 లోగా సమర్పించాలని సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ పరిణామాలతో హైదరాబాద్‌ యూనివర్సిటీ (HCU) భూముల వివాదం మరింత కీలకంగా మారింది. సోషల్ మీడియా వేదికగా అసత్యపు ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. విచారణ సందర్భంగా న్యాయపరమైన నివేదికలు, వాస్తవ ఆధారాలతో కూడిన వివరాలు కోర్టుకు సమర్పించనున్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights