
మేషం – పనులలో అదనపు బాధ్యతలను స్వీకరించవలసి వస్తుంది. అవినీతిపరులకు స్వార్ధగతన విజయం లభిస్తుంది అనే విధంగా ఓ సంఘటన చోటు చేసుకుంటుంది. వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం.
వృషభం – గృహవసర నిమిత్తపు ఖర్చులు అధికమవుతున్నట్లుగా భావిస్తారు.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రుణాలు తీరుతాయి.
మిథునం – శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుచుకుంటారు.
కర్కాటకం – క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వ్యాపార రంగంలోని వారికి అనుకూలంగా ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ లో జాగ్రత్తలు అవసరం. పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు.
సింహం – చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కాలం చాలా అనుకూలంగాఉంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మొండికి పడిన బకాయిలు చేతికి అంది వస్తాయి.
కన్య – ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచడం వలన ఎంతగానో లాభపడతారు. క్రీడా రంగాలలో మీ ప్రతిభా పాటవాలు గుర్తింపుకు నోచుకుంటాయి. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు.
తుల – ప్రతి విషయంలోనూ ప్రతి రంగంలోనూ గట్టి పోటీ ఎదుర్కొంటారు. రాని బాకీలు వివాదాస్పదం అవుతాయి. మధ్యవర్తి పరిష్కారం వల్ల లాభం, నష్టం లేకుండా బయటపడతారు.
వృశ్చికం – ప్రభుత్వపరంగా రావాల్సిన రాయితీలు ధ్రువీకరణ పత్రాలు మీకు సానుకూల పడతాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ రకాల సంస్థలు పురోగమనంలో ఉంటాయి. జనాకర్షణ ఏర్పడుతుంది.
ధనుస్సు – అనుకొని అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాలపరంగా అభివృద్ధి సాధిస్తారు. అధికారులతో మంతనాలు, రాజకీయ పైరవీలు లాభిస్తాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి.
మకరం – సినీరంగంలోని వారికి, టీవీ రంగంలోని వారికి అనుకూలమైన కాలం. పిల్లల విషయంలో ఒక దిగులు ఆలోచన ఉంటుంది. ప్రజా సంబంధ వృత్తులలో ఉన్న వారికి విశేష ఆదరణ లభిస్తుంది.
కుంభం – ఆర్థిక భారం తేలికవుతుంది. వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త వినగలుగుతారు. ఇన్సూరెన్స్ విషయాలలో జాగ్రత్త వహించండి.
మీనం – మీ ఓర్పుకు పరీక్షలు ఎదురవుతాయి సంయమనం పాటించండి. ఎంతో శ్రమ చేసి ఒక్క మాటతో ఫలితాన్ని పోగొట్టుకోవద్దు. వృత్తి ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి.
