పవన్ అన్న ఆ రాడ్ డైరెక్టర్ తో మనకెందుకన్న…ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే..?

పవన్ అన్న ఆ రాడ్ డైరెక్టర్ తో మనకెందుకన్న…ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే..?

Pawan Kalyan Film With Meher Ramesh: సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ప్రతి హీరో, దర్శకుడు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకుంటూ ముందుకు సాగాల్సిన పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన విషయం మనందరికి తెలిసిందే… ఇక రీసెంట్ గా ఓజీ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో స్టైలిష్ హీరోగా పవన్ కళ్యాణ్ తనను తాను ఆవిష్కరించుకున్నాడు. దర్శకుడు సుజిత్ సైతం పవన్ కళ్యాణ్ లో ఉన్న మేనరిజమ్స్ ని బయటకు తీసి మరోసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందించాడు…ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన మరొక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేశాడు. కాబట్టి సినిమాలపరంగా ఖాళీగా ఉంటున్న ఆయన మరికొన్ని సినిమాలకు కమిట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. అందులో అనిల్ రావిపూడి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

ఆయనతో సినిమా చేస్తే ఆ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ పరంగా ఏ మాత్రం యూస్ ఉండదని కేవలం అదొక రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాల మారుతుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ఇక మరి కొంతమంది పవన్ కళ్యాణ్ మెహర్ రమేష్ తో సినిమా చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు మెహర్ రమేష్ చేసిన సినిమాలన్ని ఫ్లాప్ గా నిలిచాయి.

గత సంవత్సరం చిరంజీవి చేసిన ‘బోళాశంకర్’ సినిమాని కూడా సక్సెస్ ఫుల్ గా నిలుపలేకపోయాడు. ఇక ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ మెహర్ రమేష్ తో సినిమా చేసి మరో ఫ్లాప్ ని మూటగట్టుకోవడం అవసరమా? ఆ రాడ్ డైరెక్టర్ తో మనకెందుకు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి మెహర్ రమేష్ తీసిన సినిమాల్లో ఒక బిల్లా మూవీ ని మినహాయిస్తే మిగిలిన ఏ సినిమా కూడా అసలు ఏ రకంగానూ ప్రేక్షకులను అలరించలేదు… మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేసి ఆయన ఇమేజ్ ని కూడా డ్యామేజ్ చేయడం అవసరమా? అంటూ మెహర్ రమేష్ ను ఉద్దేశించి కూడా పలువురు కామెంట్స్ చేస్తుండటం విశేషం…

Leave a Comment