హృతిక్‌కు హైకోర్టులో ఊరట.. ఇకపై ఫోటోలు వాడితే..


ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా తన ఫోటోలను వాడుతున్నారని ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా ఆయనకు కోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఇకపై అనుమతి లేకుండా హృతిక్ ఫోటోలు వాడడానికి వీళ్లేదని కోర్టు ఆదేశించింది. వెంటనే హృతిక్ ఫోటోలను తొలగించాలని ఇ-కామర్స్ వెబ్‌సైట్లకు సూచించింది.

అయితే అనుమతి లేకుండా తన వాయిస్, ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్, ఫ్యాన్స్ పేజీలలో ఉపయోగించుకుంటున్నారని హృతిక్ చేసిన ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది. అభిమానుల పేజీలలో వాడుకునేందుకు ప్రస్తుతానికి అనుమతి ఇచ్చింది. హృతిక్ పేరు, డ్యాన్స్ వీడియోలతో ట్యూటోరియల్స్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని నటుడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం వారు ప్రజలకు నేర్పించడం కోసం ఆ డ్యాన్స్ వీడియోలను ఉపయోగిస్తున్నారని తెలిపింది. అందులో వాణిజ్య ప్రయోజనం ఏమాత్రం లేదని.. ఎవరైనా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది.

Leave a Comment