టెక్కీలకు షాక్ H-1B హైరింగ్ ఆపేసిన TCS – Telugu News | TCS H1B Hiring Stops: US Strategy Shifts to AI, Local Techies video TV9D – World Videos in Telugu

కంపెనీ వాస్తవానికి తను పొందిన హెచ్1బి వీసాల లిమిట్ కంటే తక్కువగా బయటి ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటోంది. నెమ్మదిగా అమెరికాలోని టెక్కీలను నియమించుకుంటూ ట్రంప్ దెబ్బకి రూట్ మార్చేసింది. ఒక పక్క భారతదేశంలో భారీ లేఆఫ్స్ కొనసాగిస్తున్న టీసీఎస్ మరోపక్క అమెరికాలో కూడా హెచ్1బి వీసా ఉద్యోగులను తొలగించి అమెరికన్లతో రీప్లేస్ చేయెుచ్చనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఐటీ సేవల రంగంలో ఉన్న టీసీఎస్ మారుతున్న వ్యాపార పరిస్థితులకు అనుగుణంగా ఏఐలో భారీ పెట్టుబడులకు వెళుతోంది. ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు 7 బిలియన్ డాలర్ల వరకు వెచ్చించాలని చూస్తోందని తెలిసింది. ఏఐ ఆధారిత సేవలతో క్లయింట్లకు మెరుగైన సేవలను అందించాలని టీసీఎస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అలాగే విదేశాల్లో ఉన్న వ్యాపారాలను బలోపేతం చేయాలని నిర్ణయించింది. విదేశీ ఉద్యోగులకు ఇచ్చే H-1B వీసాలపై ట్రంప్ సర్కార్ కొత్త నిబంధల్ని తీసుకువచ్చింది. విదేశీ ఉద్యోగుల్ని నియమించుకునే కంపెనీలు ఇప్పుడు ప్రభుత్వానికి 1,00,000 డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.88 లక్షలు. ఈ చర్య భారతీయ టెక్కీలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. H-1B వీసా హోల్డర్లలో దాదాపు 70 శాతం మంది భారతీయులే ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వరుడి గొంతెమ్మ కోర్కెలు వివాహం రద్దు చేసుకున్న వధువు

బ్యాంక్‌కు చిన్నారులు..! లోన్‌ కావాలి.. సైకిల్‌ కొనుక్కుంటాం

భారీ మొసలిని భుజాలపై మోస్తూ.. రియల్‌ బాహుబలి

ఈ తరానికి కూడా 150 ఏళ్ళు బ్రతికే ఛాన్స్ ఉంది.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

లక్ అంటే ఇదీ.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన జాలరి

Leave a Comment