తుప్పల్లో ఉందని చీప్‌గా చూడొద్దు.. నమిలి తిన్నారంటే కిడ్నీల్లో రాళ్లు పిండి అవ్వాల్సిందే..

తుప్పల్లో ఉందని చీప్‌గా చూడొద్దు.. నమిలి తిన్నారంటే కిడ్నీల్లో రాళ్లు పిండి అవ్వాల్సిందే..

మూత్రపిండాల్లో రాళ్ల (కిడ్నీ స్టోన్స్) సమస్యకు మూల కారణం యూరిక్ యాసిడ్ పెరగడం. దీనిని సకాలంలో నియంత్రించకపోతే, ఆర్థరైటిస్, డయాబెటిస్, కీళ్ల నొప్పులు, వాపు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. మూత్రపిండాల్లో రాళ్ల వల్ల మూత్రపిండాల వైఫల్యం ప్రమాదం కూడా పెరుగుతుంది. అందువల్ల, యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడం చాలా ముఖ్యం. మందులతో పాటు, మీరు కొన్ని ఆయుర్వేద మూలికలతో అలాగే.. మీ ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించవచ్చంటున్నారు ఆయుర్వేద నిపుణులు..

అలాంటి ఆయుర్వేద మూలికలలో తిప్ప తీగ ఒకటి.. తిప్పతీగ అనేక వ్యాధులను నయం చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది. తిప్పతీగను ఆయుర్వేద మందుల్లో కూడా విరివిగా వాడతారు.. మీరు యూరిక్ యాసిడ్ సమస్యతో పోరాడుతుంటే తిప్పతీగ ఆకులు, వేర్లు ప్రయోజనకరంగా ఉంటుంది. గిలోయ్‌లో యాంటీ ఇన్ఫ్లమేటరీ అంశాలు పుష్కలంగా కనిపిస్తాయి. ఇది యూరిక్ యాసిడ్ లక్షణాలను తగ్గిస్తుంది.

తిప్పతీగను రోజూ వాడటం ప్రయోజనకరంగా ఉంటుంది. తిప్పతీగ తాజా ఆకులు, కాండం కోసి బాగా ఎండబెట్టి పొడిగా రుబ్బుకోవాలి. 1 గ్లాసు నీరు, కొంచెం పొడిని ఒక గిన్నెలో వేసి సగం అయ్యే వరకు మరిగించాలి. తరువాత దానిని వడకట్టి త్రాగాలి. ఇది క్యాన్సర్, మధుమేహాన్ని కూడా నివారిస్తుంది.

ఎన్నో సమస్యలకు తిప్పతీగ రామబాణం..

తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అలాగే.. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, మధుమేహం, గుండె జబ్బులను నియంత్రించడంలో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

[

Leave a Comment