ABN
, Publish Date – Apr 02 , 2025 | 04:10 AM
2023 మార్చి నాటికి రూ.14,174 నుండి పెరిగి ఇప్పుడు రూ.21,000కు చేరుకున్న ఆయిల్ పామ్ గెలల ధరలు, 64,582 మంది రైతులకు అదనపు లబ్ధి చేకూర్చాయి. రాష్ట్ర ప్రభుత్వం, పంట మార్పిడి అవసరంతో, ఆయిల్ పామ్ సాగుకు రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించింది.

రూ.21,000కు చేరిన టన్ను గెలల ధర
ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వ చర్యలు: మంత్రి తుమ్మల
హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్ గెలల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో లాభసాటిగా మారిన ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. 2023 మార్చి నాటికి రూ.14,174గా ఉన్న టన్ను ఆయిల్ పామ్ గెలల ధర ప్రస్తుతం రూ.21,000కు పెరిగిందని తుమ్మల తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.8,500 మేర ధర పెరిగిందన్నారు. పెరిగిన ధరల వల్ల 64,582 మంది ఆయిల్ పామ్ రైతులకు అదనపు లబ్ధి చేకూరనుందని చెప్పారు. రాష్ట్రంలో పంట మార్పిడి ఆవశ్యకత, వంటనూనెలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయిల్ పామ్ సాగుకు రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలియజేశారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణకు రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 14 కంపెనీలకు అనుమతులు ఇవ్వగా, ఇప్పటిదాకా సుమారు 2.43 లక్షల ఎకరాల ఆయిల్ పామ్ సాగులోకి వచ్చిందని మంత్రి తెలిపారు. ఆయిల్ పామ్ తోటల యాజమాన్యం, అంతర పంటల సాగు కోసం 45,548 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం రూ.72 కోట్లు జమ చేసిందని చెప్పారు. ఆయిల్ పామ్ సాగును లాభసాటిగా చేసి కొత్త రైతులను ప్రోత్సహించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదన మేరకు ముడి పామ్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని కేంద్రం 27.5 శాతానికి పెంచడంతో ఆయిల్ పామ్ గెలల ధర గణనీయంగా పెరిగిందని తుమ్మల వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..
ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..
జీవితాంతం సమాజం కోసమే
For More AP News and Telugu News
Updated Date – Apr 02 , 2025 | 04:10 AM