
రామగిరి మండలం ఆదివారంపేట గ్రామంలో ఘనంగా రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు జరిగాయి. గౌడ కులస్తులు బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. అదేవిధంగా అమ్మవారికి ప్రత్యేక నైవేద్యంగా తాటి చెట్టు పైనున్న కల్లు తీయడానికి చాలామంది గొడవలు ఆస్తులు ఒకే చెట్టుపై ఎక్కి చేతుల మీదుగా కల్లు కుండ కిందకు తీశారు. దేవాలయంలో గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంబాల పూజారులు పట్నం వేశారు. మహిళలు (డీజే) డప్పులతో బోనాలు ఎత్తుకొని దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.