తీవ్ర గాయాలపాలైన సాయికుమార్‌ను స్నేహితులు, బంధువులు సుల్తానాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. ప్రేమించిన పాపానికి పరువు హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ విచారణ చేపట్టారు. గ్రామంలో ఘర్షణ తలెత్తకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.