
మహాభారతంలోని ప్రధానమైన పాత్రధారి మహాత్మా విదురుడు యోధుడిగా కాకుండా రాజకీయాలకు, వ్యూహాలకు సంబంధించిన మహానుభావుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన హస్తినాపుర రాజ్యానికి ముఖ్యమంత్రిగా నియమితుడయ్యారు. తన జ్ఞానం, నైతికత కారణంగా ఆయన చెప్పిన నీతి సూక్తులు విదుర నీతిగా ప్రసిద్ధి చెందాయి.
విదురుడు చెప్పినట్లు ఒక వ్యక్తి తన భావాలను నియంత్రించుకుంటే ఆ వ్యక్తి ఎప్పుడూ తప్పుడు మార్గాల్లో నడవడు. భావాలను నియంత్రించడం ద్వారా మనస్సు కేంద్రీకరించడంలో సహాయపడుతుంది. ఈ నియమం పాటిస్తే మనం అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉంటాము. క్రమశిక్షణ, నియంత్రణతో జీవితం గడిపితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏకాగ్రత పెరిగి దాంతో విజయం పొందగలగుతాము.
విదుర నీతి ప్రకారం ఎవరికైనా మనం సహాయం చేసినప్పుడు లేదా ఎవరో మనకు సహాయం చేసినప్పుడు ఆ సహాయానికి కృతజ్ఞత చెప్పడం చాలా ముఖ్యం. ఇది మనిషికి మరింత మద్దతును అందిస్తుంది. సహాయం చేసిన వారికి ధన్యవాదాలు తెలపడం మన వ్యక్తిగత సంబంధాలను బలపరుస్తుంది. కృతజ్ఞత తెలియజేయడం ద్వారా మనం మరింత మెరుగ్గా ఎదగగలుగుతాము.
విదురుడు చెప్పినట్లు క్రమం తప్పకుండా గ్రంథాలను చదివే వ్యక్తికి జ్ఞానం పెరుగుతుంది. ఇలాంటి వ్యక్తులు మతపరంగా, నైతికంగా ఎదుగుతారు. గ్రంథాలు చదవడం మనకు సరైనదేంటో, తప్పు ఏంటో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. సమాజంలో మన గౌరవాన్ని పెంచుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు మన ఆనందం, శ్రేయస్సు కూడా పెరుగుతుంది.
విదుర నీతి ప్రకారం ప్రతి సమస్యను అంచనా వేసిన తర్వాత నిర్ణయం తీసుకోవడం అత్యవసరం. మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మన లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. ఆ జ్ఞానం మనకు గౌరవం, కీర్తిని తెచ్చిపెడుతుంది. తెలివిగా తీసుకునే నిర్ణయాలు మన జీవితంలో విజయానికి ప్రధానంగా నిలుస్తాయి.