AP TG Rains : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, రేపు ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు

Written by RAJU

Published on:

తెలంగాణలో ఎల్లో అలర్ట్

తెలంగాణ వ్యాప్తంగా రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ తదితర జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాగల రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని పేర్కొంది. అనంతరం 2-3 డిగ్రీలు పెరుగుతాయని పేర్కొంది. అకాల వర్షాలు రైతులకు ఆవేదన మిగిల్చాయి. పలు జిల్లాల్లో పంటలు ధ్వంసమై రైతులు తీవ్రంగా నష్టపోయారు.

Subscribe for notification