Satya Kumar: త్వరలో వైద్య శాఖలో పోస్టుల భర్తీ

Written by RAJU

Published on:

పల్నాడు, మార్చి 23: వైద్యశాఖలో త్వరలో సిబ్బంది కొరతను నియామకాల ద్వారా అధిగమిస్తామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ తెలిపారు.గత ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఆరోగ్యశాఖపై రూ.6500 కోట్లు అప్పులు చేసి తల మీద పెట్టి వెళ్ళిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగా లేదని ఆయన పెదవి విరిచారు. ఆదివారం పల్నాడు జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పి.సత్యకుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వంలోని అన్ని శాఖలు అప్పుల్లో కురుకుపోయి ఉన్నాయని చెప్పారు.

గతంలో ఇక్కడ పని చేసిన మంత్రి చాలా బిజీ బిజీగా పనులు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.195 కోట్లు ఇస్తే..గత ప్రభుత్వం రూ.197 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని..అంటే వారు ఖర్చు పెట్టింది రూ.2కోట్లు మాత్రమేనని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

రానున్న ఆర్థిక సంవత్సరంలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నాణ్యమైన వైద్యం కోసం 175 నియోజకవర్గల్లో 100 పడకల ఆసుపత్రులు నిర్మిస్తామన్నారు. గత ప్రభుత్వం NRGS నిధులను సైతం దుర్వినియోగం చేసిందని చెప్పారు. క్యాన్సర్ బాధితుల కోసం మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రములో లేని విధంగా క్యాన్సర్ బాధితులకు వైద్యం అందిస్తున్నామని మంత్రి వై. సత్యకుమార్ తెలిపారు.

ఇవి కూడా చదవండి..

Tirumala: తెలంగాణ నేతలు సిఫార్సు లేఖలు.. టీటీడీ ఉక్కిరి బిక్కిరి

Ex MP Kesineni Nani : డీలిమిటేషన్‌పై స్పందించిన మాజీ ఎంపీ

CM Chandrababu: పోలవరానికి సీఎం చంద్రబాబు

Vidadala Rajini: ఆయనకు నాపై చాలా కోపం.. ఎందుకో తెలియదు

Viral News: శవయాత్రలో ఆశ్చర్యకర ఘటన..

KTR: కేటీఆర్ కాన్వాయ్‌లో అపశ్రుతి

IPL Uppal Stadium: ఐపీఎల్ మ్యాచ్.. బ్లాక్ టికెట్ల దందా.. రంగంలోకి పోలీసులు

For Andhrapradesh News And Telugu News

Updated Date – Mar 23 , 2025 | 09:11 PM

Subscribe for notification