వీడెక్కడి మొగుడండీ బాబు.. ఇలాంటి డ్రెస్ మాత్రమే వేసుకోవాలంటూ భార్యకు టార్చర్..

Written by RAJU

Published on:


వీడెక్కడి మొగుడండీ బాబు.. ఇలాంటి డ్రెస్ మాత్రమే వేసుకోవాలంటూ భార్యకు టార్చర్..

ఒక మహిళ తన దుస్తులను నియంత్రించినందుకు తన భర్త, అత్తమామలపై ఫిర్యాదు చేసింది. తన భర్త, అత్తమామలు రోజంతా తనను ఇంట్లో నైటీ మాత్రమే ధరించి ఉండాలంటూ బలవంతం చేస్తున్నారంటూ బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పింది. ఈ కేసు గుజరాత్ రాష్ట్రం అహ్మాదాబాబ్‌లో వెలుగు చూసింది. అహ్మాదాబాద్‌లోని జుహాపురాకు చెందిన 21 ఏళ్ల మహిళ వేజల్పూర్ పోలీసుల ముందు తన గోడు వినిపించింది. పెళ్లైనప్పటి నుంచి తనని నైటీలు మాత్రమే వేసుకోవాలంటూ భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ వాపోయింది. వారు చెప్పినట్టు నైటీ వేసుకోకపోతే అసభ్యకర పదజాలంతో తిడుతున్నారని తెలిపింది. తిండి, నిద్ర విషయంలో కూడా ఆంక్షలు విధిస్తున్నారని.. తట్టుకోలేక ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్టు పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది.

21 ఏళ్ల ఆ మహిళ 2023లో సౌదీ అరేబియాలో వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె తన అత్తమామలతో కలిసి బాపునగర్‌కు మకాం మార్చింది. ఆ మహిళ ఫిర్యాదు ప్రకారం, ఆమె భర్త వృత్తిరీత్యా వైద్యుడు. పెళ్లైన కొంత కాలానికి అతను మద్యానికి బానిసయ్యాడని చెప్పింది. ఆమె అడ్డుకోవడంతో తనపై దాడి చేసేవాడని చెప్పింది. ఇదే విషయమై ఆ మహిళ తన అత్తమామలకు ఫిర్యాదు చేసినప్పుడు వారు తనను అర్థం చేసుకోవడానికి బదులుగా, వారు తమ కొడుకుకు మద్దతు ఇచ్చి తనపైనే ఎదురు దాడికి పాల్పడుతున్నట్టుగా చెబుతూ పోలీసులను ఆశ్రయించింది.

అంతేకాదు..బాధితురాలు తన మరిది అతని భార్యపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిద్దరూ కూడా తనపై లేని పోనివి చెబుతూ, ప్రతి పనిలోనూ తప్పులు వెతుకుతూ తన భర్తను మరింతగా రెచ్చగొడుతూ ఉంటారని ఆమె చెప్పింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంటోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Subscribe for notification